Lok Sabha Elections | ముందస్తుగా.. లోక్‌సభ ఎన్నికలు?

Lok Sabha Elections | అందుకే లోక్‌సభ అత్యవసర భేటీ ? విధాత‌: కేంద్రంలో ఏమి జరుగుతోంది ? ఢిల్లీ పెద్దలు ఏమి ఆలోచిస్తున్నారు. లోక్ సభకు ముందస్తుగానే ఎన్నికలు పెడతారా.. కాంగ్రెస్ కూటమి బలపడకముందే ఎన్నికలకు వెళ్లి వాళ్ళను కొట్టేయాలని అమిత్ షా, మోడీ ప్లాన్ చేస్తున్నారా ? దీనికోసం ఆరేడు నెలలు ముందుగానే ఎన్నికలకు వెళ్తారా ? దేశంలోని ఇతర రాష్ట్రాలను కూడా దీనికి ఒప్పిస్తున్నారా ?? అదేనా వ్యూహం.. ఈ నెల 18 […]

  • Publish Date - September 1, 2023 / 01:08 PM IST

Lok Sabha Elections |

  • అందుకే లోక్‌సభ అత్యవసర భేటీ ?

విధాత‌: కేంద్రంలో ఏమి జరుగుతోంది ? ఢిల్లీ పెద్దలు ఏమి ఆలోచిస్తున్నారు. లోక్ సభకు ముందస్తుగానే ఎన్నికలు పెడతారా.. కాంగ్రెస్ కూటమి బలపడకముందే ఎన్నికలకు వెళ్లి వాళ్ళను కొట్టేయాలని అమిత్ షా, మోడీ ప్లాన్ చేస్తున్నారా ? దీనికోసం ఆరేడు నెలలు ముందుగానే ఎన్నికలకు వెళ్తారా ? దేశంలోని ఇతర రాష్ట్రాలను కూడా దీనికి ఒప్పిస్తున్నారా ?? అదేనా వ్యూహం..

ఈ నెల 18 నుంచి 22 వరకూ అయిదు రోజుల పాటు జరిగే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలలో లోక్ సభ రద్దు అన్నది కీలకమైన అంశం అని అంటున్నారు. యూనీఫారం సివిల్ కోడ్ తో పాటు జమిలి ఎన్నికల అంశం మీద చర్చతో పాటు ప్రజలకు ఉపయోగపడే కొన్ని సంక్షేమ కార్యక్రమాల మీద బిల్లులు ప్రవేశపెట్టి వాటిని పాస్ చేయించే లక్ష్యంతో ఈ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెబుతున్నారు.

లోక్ సభను రద్దు చేయడం ద్వారా ఢిల్లీ పెద్దలు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఎన్నికలకు రెడీ అవుతారని అంటున్నారు. ఆంధ్ర ఒరిస్సా తదితర రాష్ట్రాల ఎన్నికలు సైతం అప్పుడే ఉండొచ్చని అంచనా. ఇక క్యాబినేట్ కార్యదర్శులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు ఢిల్లీలోనే ఉండాలని కేంద్రం ఆదేశించింది. తెలంగాణా, ఆంధ్రప్రదేశ్.. మధ్యప్రదేశ్, మిజోరాం, రాజస్థాన్, చత్తీస్ ఘడ్ వంటి చోట్ల కూడా ఎన్నికలు ఒకేసారి ఫిబ్రవరిలోనే ఒకేసారి జరిగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

Latest News