విధాత: కేంద్రపాలిత ప్రాంతమైన లడఖ్‌లో ఇటీవల తరచూ భూకంపాలు సంభవిస్తున్నాయి. తాజాగా శనివారం ఉదయం 8:25 గంటల ప్రాంతంలో మరోసారి భూమి కంపించింది. రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 3.4గా నమోదైనట్టు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (ఎన్‌సీఎస్) వెల్లడించింది.
భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్టు పేర్కొన్నది. ఈ విషయాన్ని ఎక్స్‌లో వెల్లడించింది. ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ ఘటనలో ఇప్పటి వరకూ ఆస్తి, ప్రాణ నష్టం జరిగినట్టు ఎలాంటి సమాచారం అందలేదు.
బంగ్లాదేశ్‌లో 5.8 తీవ్రతతో భూకంపం
బంగ్లాదేశ్‌లో కూడా రిక్టర్ స్కేల్‌పై 5.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ (జిఎఫ్‌జెడ్) ప్రకారం.. ఈ భూకంప కేంద్రం 10 కిలోమీటర్ల లోతులో ఉన్నట్టు గుర్తించారు.