Site icon vidhaatha

Ecuador | ఈక్వెడార్ అధ్యక్ష అభ్యర్థి హ‌త్య‌.. వీడియో వైరల్

Ecuador

Ecuador | ఈక్వెడార్ దేశాధ్య‌క్ష ఎన్నిక‌ల బ‌రిలో నిలిచిన ఫెర్నాండో విల్లావిసెన్సియో (Villavicencio) ను ఓ దుండ‌గుడు కాల్చి చంపేశారు. రాజధాని క్విటో న‌గ‌రంలో బుధ‌వారం ఎన్నిక‌ల ప్ర‌చారం ముగించుకొని వెళ్లే క్ర‌మంలో ఓ దుండ‌గుడు దాదాపు 30 రౌండ్లు కాల్పులు జ‌రిపిన‌ట్లు స్థానిక మీడియా నివేదించింది.

ఫెర్నాండోను చంపేందుకు తొలుత గ్రెనేడ్ విస‌ర‌గా, అది పేల‌క‌పోవ‌డంతో ఓ దుండ‌గుడు స‌మీపంలోకి వ‌చ్చి ఫెర్నాండో త‌ల‌పై కాల్చడంతో ఆయ‌న అక్క‌డిక‌క్క‌డే చ‌నిపోయారు. ఈ కాల్ప‌ల్లో ఇద్దరు పోలీసు అధికారులు సహా మరో తొమ్మిది మంది గాయపడ్డారు. కాల్పుల ఘ‌ట‌న వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

Exit mobile version