Electricity bill | రెండు బల్బుల ఇంటికి.. లక్ష కరెంటు బిల్లు

Electricity bill 90 ఏళ్ల మహిళకు షాకిచ్చిన కర్ణాటక కరెంటాఫీస్‌ విమర్శలు రావడంతో సరిదిద్దిన అధికారులు విధాత: వేలల్లో విద్యుత్‌ బిల్లలు పొరపాటున జారీ అవుతుంటం చూస్తూనే ఉంటాం. కానీ.. కర్ణాటకలో మాత్రం ఒక వృద్ధురాలికి కరెంటు ఆఫీసువాళ్లు షాకే ఇచ్చారు. రెండు బల్బులు మాత్రమే వాడుకునే ఆ వృద్ధురాలికి వచ్చిన బిల్లు.. చూస్తే గుండె గుభేల్మనక తప్పదు. కర్ణాటకలో గిరిజమ్మ అనే 90 ఏళ్ల వృద్ధురాలు తనకు వచ్చిన కరెంటు బిల్లు చూసి అవాక్కయింది. పైసా […]

  • Publish Date - June 23, 2023 / 10:40 AM IST

Electricity bill

  • 90 ఏళ్ల మహిళకు షాకిచ్చిన కర్ణాటక కరెంటాఫీస్‌
  • విమర్శలు రావడంతో సరిదిద్దిన అధికారులు

విధాత: వేలల్లో విద్యుత్‌ బిల్లలు పొరపాటున జారీ అవుతుంటం చూస్తూనే ఉంటాం. కానీ.. కర్ణాటకలో మాత్రం ఒక వృద్ధురాలికి కరెంటు ఆఫీసువాళ్లు షాకే ఇచ్చారు. రెండు బల్బులు మాత్రమే వాడుకునే ఆ వృద్ధురాలికి వచ్చిన బిల్లు.. చూస్తే గుండె గుభేల్మనక తప్పదు.

కర్ణాటకలో గిరిజమ్మ అనే 90 ఏళ్ల వృద్ధురాలు తనకు వచ్చిన కరెంటు బిల్లు చూసి అవాక్కయింది. పైసా కూడా తగ్గేది లేదని లోకల్‌ లైన్‌మెన్‌ చెప్పడంతో ఏం చేయాలో పాలుపోలేదు. నిజానికి ఆమె ఇంటికి భాగ్యజ్యోతి స్కీం కింద ప్రభుత్వం కరెంటు కనెక్షన్‌ ఇచ్చింది. కేవలం రెండు బల్బులు మాత్రమే వాడుకునే ఆ ఇంట్లో ఆమె తన కుమారుడితో కలిసి ఉంటున్నది. కానీ.. బిల్లు మాత్రం రూ.1,03,315 వచ్చింది.

భాగ్యజ్యోతి కింద 18 యూనిట్లు ఫ్రీ. అంటే ఆ ఇంటికి వాడే రెండు బల్బులకు మహా అయితే 70 లేదా 80 రూపాయలు బిల్లు రావాలి. కానీ.. ఏకంగా లక్షపైనే బిల్లు ఇచ్చారు. ఆరు నెలల క్రితమే ఆమె ఇంట్లో మీటర్‌ బిగించారు. కానీ.. ప్రతి నెలా 20వేల బిల్లు వచ్చేదని ఆమె వాపోయారు. ఈ ఘటన వెలుగులోకి రావడంతో ఉన్నతాధికారులు హుటాహుటిన ఆమె ఇంటికి వెళ్లి.. మీటర్‌ను సరి చేశారు.

బిల్లు కట్టాల్సిన అవసరం లేదని చెప్పడంతో ఆ వృద్ధురాలు ఊపిరి పీల్చుకున్నది. బిల్‌ కలెక్టర్‌ చేసిన తప్పిదం వల్ల ఇంతటి భారీ బిల్లు వచ్చిందని అధికారులు చెప్పారు. వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.