విధాత : జాతీయ రహదారిపై వెలుతున్న వాహనాలకు అడ్డంపడి వాటిని ధ్వంసం చేసి ఓ ఏనుగు హైవేపై బీభత్సం సృష్టించింది. తమిళనాడు నీలగిరి జిల్లా కొత్తగిరి-మెట్టుపాలెం జాతీయ రహదారిపై రోడ్డు దాటుతున్న ఏనుగును చూసి కారును ఆపారు. ఏనుగు కారు వద్ధకు రావడంతో భయంతో అందులోని వారు దిగి దూరంగా పరుగెత్తారు.
ఏనుగు మాత్రం కారు డోర్లను ఉడబెరికేసి, కారును తోసేసి విధ్వంసానికి పాల్పడింది. ఏనుగు విధ్వంసాన్ని చూసిన ఇతర వాహనదారులు గట్టిగా కేకలు వేసి దానిని అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేసినా ఏనుగు పట్టించుకోకుండా నింపాదిగా కారును ధ్వంసం చేశాకే అడవిలోకి వెళ్లింది. ఏనుగు దాడి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.