Viral Video |
నదుల్లో, కాలువల్లో గజరాజులు జలకాలాటాలు ఆడటం సహజమే.. కానీ ఏనుగులు (Elephants) సొంతంగా స్నానం చేసుకోవడం ఎప్పుడైనా చూశారా..? ఓ మనిషి మాదిరిగానే ఏనుగు కూడా స్నానం చేయగలదా..? అయితే ఈ వీడియోనే నిదర్శనం.
ఓ ఆలయంలో భారీ ఏనుగు స్నానం చేస్తున్న దృశ్యాలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. నీళ్లు వస్తున్న ఓ పైపును తొండంతో పట్టుకుని శరీరమంతా నీటిని పోసుకుంది.
మనిషిలాగే ఆ ఏనుగు కూడా స్నానం చేసి అందర్నీ ఆశ్చర్యపరించింది. ఏనుగులు కూడా సొంతంగా స్నానం చేసుకోగలవు అని నిరూపించింది. అయింతా సేపు ఆ ఏనుగు చల్లని నీటికి ఎంజాయ్ చేసింది.