Twitter | పిట్టా పోయి కుక్క వచ్చే ఢాం.. ఢాం.. ఢాం..! ట్విట్టర్ బొమ్మను మార్చేసిన ఎలాన్ మస్క్

విధాత: అపార కుబేరుడు ఏం చేయాలో తెలియక సోషల్ మీడియా ప్లాట్ఫారం ట్విట్టర్ ను కొనేశాడు.. తరువాత దాన్ని ఏం చేయాలో తెలియక కొందరు పెద్ద తలకాయలు, పై పోష్టుల్లోని కొందర్ని లేపేసాడు. ఇంకా స్టాఫ్ ను బాగా తగ్గించాడు. అబ్బే.. ఈ మార్పులు సరిపోవు అనుకున్నాడో ఏమో మొత్తానికి ట్విట్టర్ లోగోను మార్చేశాడు. ఆ మార్పులు సరిపోలేదేమో ఇన్నాళ్లూ ట్విట్టర్ అనగానే మనకు గుర్తొచ్చే నీలం రంగు బుజ్జి పిట్ట ను సైతం లేపేసాడు… ఇదేమయ్యా […]

  • Publish Date - April 4, 2023 / 02:45 PM IST

విధాత: అపార కుబేరుడు ఏం చేయాలో తెలియక సోషల్ మీడియా ప్లాట్ఫారం ట్విట్టర్ ను కొనేశాడు.. తరువాత దాన్ని ఏం చేయాలో తెలియక కొందరు పెద్ద తలకాయలు, పై పోష్టుల్లోని కొందర్ని లేపేసాడు. ఇంకా స్టాఫ్ ను బాగా తగ్గించాడు. అబ్బే.. ఈ మార్పులు సరిపోవు అనుకున్నాడో ఏమో మొత్తానికి ట్విట్టర్ లోగోను మార్చేశాడు.

ఆ మార్పులు సరిపోలేదేమో ఇన్నాళ్లూ ట్విట్టర్ అనగానే మనకు గుర్తొచ్చే నీలం రంగు బుజ్జి పిట్ట ను సైతం లేపేసాడు… ఇదేమయ్యా అంతే నా ఇష్టం… కాస్త డిఫరెంట్ గా థింకండి బాబులూ అంటున్నాడు. ఇన్నల్లో ట్విట్టర్ పిట్టగా అందరికి గుర్తుండే ఈ బుజ్జి పిట్టను తీసేసి దాని స్థానంలో కుక్క బొమ్మను తెచ్చి పెట్టాడు మస్క్.

ఇన్నాళ్లూ పిట్ట కూతలుగా భావించే ట్విట్టర్ ఇక ముందు కుక్క అరుపులకు వేదికగా మారుతుందేమో అని సోషల్ మీడియా జనాలు అభిప్రాయపడుతున్నారు.

ట్విటర్ ను(TWITTER) కొన్నప్పటి నుంచి వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటూ ఉద్యోగులను మందిని తీసేసి.. ఖర్చులు తగ్గింపు పేరిట కాస్ట్ కటింగ్ చేసి.. ట్విట్టర్ లో బ్లూటిక్ కోసం డబ్బులు వసూలు చేస్తూ చిత్రమైన విన్యాసాలకు పాల్పడుతున్న ఎలన్ మస్క్. ఇప్పుడు ఏకంగా ట్విట్టర్ కు ఎంతో పేరు తీసుకొచ్చిన లోగోనే మార్చేసాడు

ప్రస్తుతం వచ్చిన కుక్క బొమ్మ కేవలం కేవలం డెస్క్ టాప్ వెర్షన్ లో మాత్రమే…అంతే ల్యాప్టాప్, కంప్యూటర్లలో కనిపిస్తుంది. మొబైలులో మాత్రం ఇంకా బ్లూ పిట్ట మాత్రమే ఉంది. అక్కడ కూడా త్వరలో ఈ కుక్క బొమ్మ వచ్చేలా చేస్తాం అని ట్విట్టర్ టెక్నీకల్ టీమ్ చెబుతోంది.