Etala Rajender | వచ్చే ఎన్నికల్లో KCR ప్రభుత్వాన్ని బొంద పెట్టడం ఖాయం

Etala Rajender పేదలకు డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇవ్వకపోతే గుణపాఠం తెలంగాణ రాకముందు ఇచ్చిన హామీల పట్ల నిర్లక్ష్యం ఇండ్ల సమస్యపై వరంగల్ జిల్లాలో ధర్నా BJP తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: వచ్చే ఎన్నికల్లో KCR ప్రభుత్వాన్ని బొంద పెట్టడం ఖాయమని BJP తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ జోస్యం చెప్పారు. పేదలకు డబుల్ […]

  • Publish Date - July 24, 2023 / 01:24 AM IST

Etala Rajender

  • పేదలకు డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇవ్వకపోతే గుణపాఠం
  • తెలంగాణ రాకముందు ఇచ్చిన హామీల పట్ల నిర్లక్ష్యం
  • ఇండ్ల సమస్యపై వరంగల్ జిల్లాలో ధర్నా
  • BJP తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: వచ్చే ఎన్నికల్లో KCR ప్రభుత్వాన్ని బొంద పెట్టడం ఖాయమని BJP తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ జోస్యం చెప్పారు. పేదలకు డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇవ్వకపోతే వారే రానున్న ఎన్నికల్లో గుణపాఠం చెబుతారని అన్నారు. హనుమకొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం, పోచమ్మమైదాన్ వద్ద సోమవారం ధర్నా కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. జనగామ లో జరిగిన ధర్నా కార్యక్రమానికి ప్రేమేందర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ ధర్నాను ఉద్దేశించి ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్రం రాకముందు KCR ఇచ్చిన హామీల పట్ల నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు. రెండోసారి అధికారంలోకి వచ్చాక KCR కళ్ళు నెత్తికెక్కాయని మండిపడ్డారు.

ఒక్కో ఇంటి నిర్మాణానికి హడ్కో ద్వారా 2 లక్షల రూపాయల ఇచ్చారని వివరించారు. కేంద్ర ప్రభుత్వ డబ్బులు తీసుకున్నావ్ KCR నీ అబ్బ జాగీరా… డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించి చూపియ్యంటూ నిలదీశారు. ధనిక రాష్ట్రం అయితే ఇండ్లు ఎందుకు నిర్మిస్తలేరని, పాత్రికేయులకు ఇస్తానన్న ఇండ్లు ఏమయ్యాయని ప్రశ్నించారు. కూలి చేసుకున్న పైసలు బార్ షాపులకు వెళ్తున్నాయని విమర్శించారు. BJP ప్రభుత్వం వస్తే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మిస్తామన్నారు. కల్లబొల్లి మాటలతో పేద ప్రజలనే కాకుండా జర్నలిస్టు మిత్రులను కూడా స్థానిక ఎమ్మెల్యే మోసం చేశారన్నారు.

నీకు ఇచ్చే మనసు కానీ ఉంటే రెండు రోజుల్లో జర్నలిస్టులతో పాటు పేద ప్రజలకు డబుల్ బెడ్ రూం ఇండ్లు పంచాలని డిమాండ్ చేశారు. BJP హనుమకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ, వరంగల్ జిల్లా పార్టీ అధ్యక్షుడు కొండేటి శ్రీధర్, మాజీ శాసనసభ్యులు వన్నాల శ్రీరాములు, జిల్లా ఇంఛార్జి డాక్టర్ వి మురళీధర్ గౌడ్, మాజీ ఎమ్మెల్యేలు మార్తినేని ధర్మారావు, మొలుగూరి బిక్షపతి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కుసుమ సతీష్, అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంకు చైర్మన్ ప్రదీప్ రావు, రాకేష్ రెడ్డి జిల్లా పదాధికారులు, మోర్చాల అధ్యక్షులు పాల్గొన్నారు.

Latest News