వరంగల్: మాజీ నక్సలైట్ చర్య విఫలం.. ముగ్గురు అరెస్టు: SP పాటిల్

విధాత, వరంగల్: ఇద్దరు యువకులను మావోయిస్టు పార్టీలో చేరేలా ప్రేరేపించిన మాజీ నక్సలైట్‌తో పాటు ఇద్దరు యువకులను అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ డా.సంగ్రాంసింగ్ జి. పాటిల్ శుక్రవారం తెలిపారు. మల్లంపల్లికి చెందిన బాలుగు గణేష్ , జాకారం గ్రామానికి చెందిన పుల్యాల నవీన్, మాజీ నక్సలైట్ బోట్ల అశోక్ ను అరెస్ట్ చేశారు. వారి నుంచి విప్లవ సాహిత్యం సెల్‌ఫోన్‌లు స్వాధీనం చేసుకున్నారు. బొట్ల అశోక్ అనే మాజీ నక్సలైట్‌ వ్యక్తిగత స్వార్ధంతో యువకులను తప్పుదోవ […]

  • Publish Date - January 6, 2023 / 10:01 AM IST

విధాత, వరంగల్: ఇద్దరు యువకులను మావోయిస్టు పార్టీలో చేరేలా ప్రేరేపించిన మాజీ నక్సలైట్‌తో పాటు ఇద్దరు యువకులను అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ డా.సంగ్రాంసింగ్ జి. పాటిల్ శుక్రవారం తెలిపారు.

మల్లంపల్లికి చెందిన బాలుగు గణేష్ , జాకారం గ్రామానికి చెందిన పుల్యాల నవీన్, మాజీ నక్సలైట్ బోట్ల అశోక్ ను అరెస్ట్ చేశారు. వారి నుంచి విప్లవ సాహిత్యం సెల్‌ఫోన్‌లు స్వాధీనం చేసుకున్నారు.

బొట్ల అశోక్ అనే మాజీ నక్సలైట్‌ వ్యక్తిగత స్వార్ధంతో యువకులను తప్పుదోవ పట్టించాడని తెలిపారు. గతంలో అతనిపై 4 క్రిమినల్ కేసులు ఉన్నాయని చెప్పారు. ముగ్గురు నిందితులను కోర్టుకు హాజరు పరుస్తామని చెప్పారు. ఈ అరెస్టులో ములుగు ఓఎస్డీ గౌష్, ములుగు ఎస్ ఐ ఓంకార్ యాదవ్ టీం సభ్యులున్నారని చెప్పారు.