విధాత: దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యానికి సమీప రాష్ట్రాల్లో రైతులు కొయ్యకాళ్లు, వ్యవసాయ వ్యర్థాలనే కాల్చడమే ప్రధాన కారణమని ఆరోపిస్తున్న నేపథ్యంలో కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ కీలక వివరాలు వెల్లడించారు. గతేడాదితో పోల్చిస్తే రైతులు కొయ్యకాళ్లను కాల్చడం చాలా మేరకు తగ్గించారని వెల్లడించింది.
పంజాబ్, హర్యానాల్లో నిరుడుతో పోలిస్తే 27 శాతం, 37 శాతం మేర కొయ్యకాళ్ల మంటలు తగ్గినట్టు తెలిపింది. 2020లో 83,002 చోట్ల మంటలు పెట్టగా, పంజాబ్‌లో 2021లో 71,304కి, 2022లో 49,922కి, 2023లో 36,663కి పడిపోయాయని మంత్రిత్వశాఖ గురువారం తెలిపింది.
2022తో పోల్చితే 2023లో వ్యవసాయ వ్యర్థాలు కాల్చడం 27 శాతం మే తగ్గినట్టు వివరించింది. పంజాబ్‌లో 27%, హర్యానాలో 37% పొలంలో మంటలు తగ్గాయి. 2020లో 83,002 చోట్ల మంటలు పెడితే, పంజాబ్‌లో 2021లో 71,304కి, 2022లో 49,922కి, 2023లో 36,663కి పడిపోయాయని మంత్రిత్వశాఖ వివరించింది. 2021, 2020తో పోల్చినప్పుడు వరుసగా 49 శాతం, 56 శాతంగా ఉంది.
2020లో హర్యానాలో వ్యవసాయ మంటల సంఖ్య 4,202గా ఉన్నది. ఇది 2021లో 6,987కి పెరిగింది, తర్వాత 2022లో 3,661కి తగ్గింది, 2023లో 2,303కి తగ్గింది. ఇది 2022తో పోలిస్తే 2023లో 37 శాతం తగ్గింపును సూచిస్తుంది.
2021తో పోలిస్తే 67 శాతం, 2020తో పోలిస్తే 45 శాతం తగ్గింపులు ఉన్నాయి. 2022తో పోల్చితే 2023లో పంజాబ్‌లోని నాలుగు జిల్లాల్లో 50 శాతం తక్కువ రైతులు కొయ్యకాళ్ల తగులబెట్టారని ఆ శాఖ తెలిపింది. ఐదు జిల్లాలు 27 శాతం నుంచి 50 శాతం వరకు మెరుగుదలను చూపించాయని పేర్కొన్నది.