Train | విరిగిన రైలు ప‌ట్టాలు.. ఎర్ర‌టి బ‌ట్ట‌తో రైలును ఆపిన రైతు

Train | ఓ రైతు వంద‌ల మంది ప్రాణాల‌ను కాపాడాడు. విరిగిన రైలు ప‌ట్టాల‌ను గ‌మ‌నించిన రైతు.. ఎరుపు రంగు బ‌ట్ట‌ను ఊపి రైలును ఆపాడు. రైలు ప్ర‌మాదాన్ని నివారించిన రైతుకు లోకో పైల‌ట్ అభినంద‌న‌లు తెలిపారు. వివ‌రాల్లోకి వెళ్తే.. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ప్ర‌యాగ్‌రాజ్ నుంచి ల‌క్నోకు గోమ‌తి ఎక్స్‌ప్రెస్ శుక్ర‌వారం ఉద‌యం బ‌య‌ల్దేరింది. భోలాకాపురా గ్రామానికి చెందిన రైతు భ‌న్వ‌ర్ సింగ్ ఉద‌యం 6 గంట‌ల స‌మ‌యంలో త‌న పొలానికి వెళ్తుండ‌గా.. ప‌ట్టా విరిగిపోయిన దృశ్యాన్ని గ‌మ‌నించాడు. […]

  • Publish Date - August 5, 2023 / 06:42 AM IST

Train | ఓ రైతు వంద‌ల మంది ప్రాణాల‌ను కాపాడాడు. విరిగిన రైలు ప‌ట్టాల‌ను గ‌మ‌నించిన రైతు.. ఎరుపు రంగు బ‌ట్ట‌ను ఊపి రైలును ఆపాడు. రైలు ప్ర‌మాదాన్ని నివారించిన రైతుకు లోకో పైల‌ట్ అభినంద‌న‌లు తెలిపారు.

వివ‌రాల్లోకి వెళ్తే.. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ప్ర‌యాగ్‌రాజ్ నుంచి ల‌క్నోకు గోమ‌తి ఎక్స్‌ప్రెస్ శుక్ర‌వారం ఉద‌యం బ‌య‌ల్దేరింది. భోలాకాపురా గ్రామానికి చెందిన రైతు భ‌న్వ‌ర్ సింగ్ ఉద‌యం 6 గంట‌ల స‌మ‌యంలో త‌న పొలానికి వెళ్తుండ‌గా.. ప‌ట్టా విరిగిపోయిన దృశ్యాన్ని గ‌మ‌నించాడు. అదే స‌మ‌యంలో అటువైపు గోమ‌తి ఎక్స్‌ప్రెస్ దూసుకొస్తోంది.

అప్ర‌మ‌త్త‌మైన రైతు రైలును గ‌మ‌నించి.. ఎరుపు రంగు బ‌ట్ట‌ను ఊపాడు. రైతు ఉద్దేశాన్ని అర్థం చేసుకున్న లోకో పైల‌ట్ రైలు వేగానికి బ్రేకులు వేసి నిదానంగా ఆపాడు. ప‌ట్టాలు విరిగిన దృశ్యాన్ని చూసి విస్తుపోయిన లోకోపైల‌ట్.. రైతు భ‌న్వ‌ర్ సింగ్‌ను అభినందించాడు. వంద‌లాది ప్ర‌యాణికుల‌ను పెద్ద ప్ర‌మాదం నుంచి కాపాడావు అంటూ రైతుకు లోకో పైల‌ట్ కృత‌జ్ఞ‌తలు తెలిపాడు. ఈ మార్గంలో రైళ్ల రాక‌పోక‌లు నిలిపివేసి.. మ‌ర‌మ్మ‌తులు పూర్త‌య్యాక మ‌ళ్లీ రైళ్ల సేవ‌ల‌ను కొన‌సాగించారు.

Latest News