రైతు పోరుబాట.. కాంగ్రెస్ నిరసనలు!

మాటతప్పిన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ధరణి పోర్టల్ రద్దు చేయండి, రైతుల తిప్పలు తీర్చండి పోడు భూములకు పట్టాలు ఇవ్వండి గిరిజనుల గోస పుచ్చుకోవద్దు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నిరసన దీక్షలు అన్ని నియోజకవర్గాల్లో ఆందోళనలు, ధర్నాలు భారీగా పాల్గొన్న రైతులు, కాంగ్రెస్ శ్రేణులు భూమి సమస్యలపై కాంగ్రెస్ ధర్నాలు విజయవంతం విధాత: కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు రైతు పోరు బాట కార్యక్రమం విజయవంతమైంది. రాష్ట్రంలోని కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు పాల్గొని రైతులకు మద్దత్తుగా ఆందోళనలు చేపట్టారు. […]

  • Publish Date - November 30, 2022 / 01:10 PM IST
  • మాటతప్పిన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం
  • ధరణి పోర్టల్ రద్దు చేయండి, రైతుల తిప్పలు తీర్చండి
  • పోడు భూములకు పట్టాలు ఇవ్వండి
  • గిరిజనుల గోస పుచ్చుకోవద్దు
  • రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నిరసన దీక్షలు
  • అన్ని నియోజకవర్గాల్లో ఆందోళనలు, ధర్నాలు
  • భారీగా పాల్గొన్న రైతులు, కాంగ్రెస్ శ్రేణులు
  • భూమి సమస్యలపై కాంగ్రెస్ ధర్నాలు విజయవంతం

విధాత: కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు రైతు పోరు బాట కార్యక్రమం విజయవంతమైంది. రాష్ట్రంలోని కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు పాల్గొని రైతులకు మద్దత్తుగా ఆందోళనలు చేపట్టారు. రైతు రుణమాఫీ, ధరణి పోర్టల్ రద్దు, పోడు భూముల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ శ్రేణులు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో చేపట్టిన ఆందోళనకు భారీ స్పందన కనిపించింది. రాష్ట్ర నాయకులు, డీసీసీ అధ్యక్షులు, నియోజక వర్గ ఇంచార్జిలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు ధర్నాల్లో పాల్గొన్నారు.

రైతాంగ సమస్యల పరిష్కారం కోసం ఉద్యమ కార్యాచరణలో భాగంగా పీసీసీ పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ పోరుబాట రాష్ట్ర వ్యాప్తంగా జరిగింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జరిగిన కార్యక్రమంలో మాజీ పార్లమెంట్ సభ్యులు పొన్నం ప్రభాకర్, శాసనమండలి సభ్యులు జీవన్ రెడ్డి, చొప్పదండి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మేడిపల్లి సత్యంలు హాజరై రైతు సమస్యలపై గళమెత్తారు.

ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలతో హోరెత్తించారు. నల్గొండ, హుజుర్ నగర్, మిర్యాలగూడ, కోదాడ, నకిరేకల్, ఆలేరు, భువనగిరి, మునుగోడు, దేవరకొండ నియోజకవర్గ కేంద్రాల్లో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు ధర్నాలల్లు నిర్వహించారు.

యదాద్రి భువనగిరి జిల్లాలో పీసీసీ పిలుపు మేరకు రైతు సమస్యలు పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ చౌటుప్పల్ మండలం RDO కార్యాలయం ముందు ధర్నా చేశారు. ఈ కార్యక్రమంలో మునుగోడు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి పాల్వాయి స్రవంతి పాల్గొన్నారు. ఎల్బీనగర్ రింగ్ రోడ్‌లో జరిగిన నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేత మల్ రెడ్డి రాంరెడ్డి హాజరై ఆందోళన చేపట్టారు.

మెదక్ జిల్లా కేంద్రంలో పోస్టాఫిస్‌ చౌరస్తాలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కంఠా రెడ్డి తిరుపతి రెడ్డి రైతుల సమస్యలైన రైతు రుణమాఫీ, ధరణి పోర్టల్ రద్దు, పొడు భూముల సమస్యల పరిష్కారం కోసం నిరసన దీక్ష చేపట్టారు. నాలుగేండ్ల క్రితం ఎన్నికల సమయంలో రూ.లక్ష రుణ మాఫీ చేస్తానని మాట ఇచ్చింది, కాని నేటికీ నాలుగేండ్లు గడుస్తున్నా మాఫీ అవ్వక రైతులు బ్యాంకుల చుట్టు తిరుగుతూ కొత్తగా అప్పు పుట్టక ఆత్మ హత్యలు చేసుకుంటున్నారని తెలిపారు. ముమ్మాటికీ ఇవి ప్రభుత్వ హత్యలుగానే భావించాలన్నారు.

అలాగే ధరణి పోర్టల్‌లో పెద్ద ఎత్తున తప్పులు దొర్లాయని, ధరణి పోర్టల్ అనేదే దొరల పోర్టల్‌గా మారిందని ఆయన దుయ్యబట్టారు. వెంటనే ధరణి పోర్టల్‌ను రద్దు చేసి పాత విధానం కొంనసాగించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ వరంగల్ డిక్లరెషన్‌లో చెప్పినట్లు అధికారంలోకి రాగానే 2 లక్షల రుణ మాఫీ చేయడంతో పాటు ధరణి పోర్టల్ రద్దు చేస్తామన్నారు.

త్వరలో రేవంత్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టనున్న యాత్రను మెదక్ నుండి ఉండే విధంగా ఆయనతో చర్చించినట్లు తెలిపారు. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేటలో పొడు భూములు, ధరణి పోర్టల్, నకిలీ విత్తనాల సమస్యలపై కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆర్డీఓ కార్యాలయం ముందు రైతులు చేపట్టిన ఆందోళన విజయవంతమైంది. డీసీసీ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ పాల్గొన్నారు.

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలపై నిర్వహించిన సదస్సులో మాజీ మంత్రి జె. గీతారెడ్డి, రాష్ట్ర కిసాన్ సెల్ నాయకుడు అన్వేష్ రెడ్డి పాల్గొన్నారు. జనగాం నియోజకవర్గ కేంద్రంలో మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్నారు.

అదేవిధంగా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు, శ్రేణులు రైతు పోరుబాట కార్యక్రమంలో భాగంగా నిరసనలు, ఆందోళనలు నిర్వహించారు. ఆదివాసుల పోడు భూములకు పట్టాలిచ్చి వారికి ఎలంటి కష్టం రాకుండా చూసుకుంటానని, రైతులకు భూములకు సంబంధించి ఎలాంటి సమస్యలు, వివాదాలు లేకుండా చూస్తానని వాగ్ధానం చేసి కేసీఆర్‌ అధికారంలోకి వచ్చారు. కానీ అందల మెక్కిన తర్వాత అన్నింటినీ తుంగలో తొక్కి ప్రజాల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని కాంగ్రెస్‌ నేతలు ఆరోపించారు.