తెలంగాణ ప్రభుత్వానికి షాక్: CBIకి.. ఫామ్‌హౌస్ కేసు

విధాత: రాష్ట్ర హైకోర్టు ఫామ్‌హౌస్ కేసు విచారణను వెంటనే సిబీఐకి అప్పగించాలని సిట్‌ను ఆదేశించింది. ఈ కేసులో విచారణ క్రమంలో సిట్ దర్యాప్తును వ్యతిరేకంచిన బీజేపీ పిటిషనర్ల వాదనలతో హైకోర్టు ఏకీభవించింది. సిట్ వాదనలను త్రోసిపుచ్చింది. ఈ కేసు దర్యాప్తు నుండి సిట్‌ను హైకోర్టు తప్పించింది. సిట్ ఇప్పటిదాకా జరిపిన దర్యాప్తు వివరాలను వెంటనే సీబీఐకి అందించాలని ఆదేశాలు ఇచ్చింది. సిట్ కు వ్యతిరేకంగా పిటిషనర్ల తరుపున మహేష్ జెఠ్మలాని, సిట్ తరపున దుష్యంతు దవే వేడివేడి […]

  • Publish Date - December 26, 2022 / 10:21 AM IST

విధాత: రాష్ట్ర హైకోర్టు ఫామ్‌హౌస్ కేసు విచారణను వెంటనే సిబీఐకి అప్పగించాలని సిట్‌ను ఆదేశించింది. ఈ కేసులో విచారణ క్రమంలో సిట్ దర్యాప్తును వ్యతిరేకంచిన బీజేపీ పిటిషనర్ల వాదనలతో హైకోర్టు ఏకీభవించింది. సిట్ వాదనలను త్రోసిపుచ్చింది. ఈ కేసు దర్యాప్తు నుండి సిట్‌ను హైకోర్టు తప్పించింది. సిట్ ఇప్పటిదాకా జరిపిన దర్యాప్తు వివరాలను వెంటనే సీబీఐకి అందించాలని ఆదేశాలు ఇచ్చింది.

సిట్ కు వ్యతిరేకంగా పిటిషనర్ల తరుపున మహేష్ జెఠ్మలాని, సిట్ తరపున దుష్యంతు దవే వేడివేడి వాదనలు వినిపించారు. సిట్ విచారణ నుంచి ఈ కేసును తప్పించాలని, దర్యాప్తు వివరాలను లీక్ చేస్తున్నారని, నిందితులు నందకుమార్ న్యాయవాది శ్రీనివాసులు పిటిషన్లు దాఖలు చేశారు.

రాష్ట్ర హైకోర్టు ఫామ్ హౌస్ కేసును సిట్‌ను కాదని సీబీఐకి అప్పగించడం.. రాష్ట్ర ప్రభుత్వానికి ఈ కేసు వ్యవహారంలో పెద్దఎదురు దెబ్బ తగిలినట్లు అయింది.