Site icon vidhaatha

Farooq Abdullah | మ‌హిళా జ‌ర్న‌లిస్టుతో ఫ‌రూక్ అబ్దుల్లా అసంద‌ర్భ సంభాష‌ణ‌.. నెట్టింట్లో విమ‌ర్శ‌లు

Farooq Abdullah |

మ‌హిళా జ‌ర్న‌లిస్టుతో జ‌మ్మూ క‌శ్మీర్ మాజీ ముఖ్య‌మంత్రి ఫ‌రూక్ అబ్దుల్లా చేసిన అసంద‌ర్భ సంభాష‌ణ వీడియో నెట్‌లో వైర‌ల్‌గా మారింది. త‌న‌తో ఇంట‌ర్వ్యూ చేస్తున్న జ‌ర్న‌లిస్ట్ ఉర్ఫానా మునీర్‌తో ఆయ‌న స‌ద‌రు వ్యాఖ్యాలు చేశారు. కెమేరా ఆన్‌లో ఉండ‌గానే ‘నువ్వు మీ ఆయ‌న‌ను ఎంపిక చేసుకున్నావా? నువ్వు చూసుకున్నావా? మీ త‌ల్లిదండ్రులు చూశారా? నీ చేతుల మీద ఈ మెహందీ ఎందుకు ఉంది అని ఫ‌రూక్ ప్ర‌శ్నించారు.

దీనికి దిగ్భ్రాంతి చెందిన ఆ జ‌ర్న‌లిస్టు..త‌న సోదరుడి వివాహం ఉండ‌టంతో మెహందీ పెట్టుకున్నాన‌ని స‌మాధానం ఇచ్చారు. దీనిని ఫ‌రూక్ వెట‌కారంగా.. ఆ పెళ్లి అవుతుందా లేక పెళ్లి కూతురు పారిపోతుందా’ అని వ్యాఖ్యానించారు. ఈ సంభాష‌ణ ఆగ‌స్టులో జ‌రిగిన‌ప్ప‌టికీ తాజాగా వైర‌ల్‌గా మారింది. దీనిపై భాజ‌పా నాయ‌కులు స‌హా ప‌లువురు నెటిజ‌న్లు సైతం తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

ఫ‌ రూక్ చేసిన‌వి వెకిలి వ్యాఖ్య‌లే కాక స్త్రీ వ్య‌తిరేక వ్యాఖ్యల‌ని భాజ‌పా నేత ట్విట‌ర్‌లో విమ‌ర్శ‌లు గుప్పించారు. జ‌ర్న‌లిస్టుల‌ను బ్యాన్ చేసే ఒక గ్రూపు స‌భ్యుడి నుంచి ఇంత‌కంటే ఆశించ‌లేమ‌ని ఐఎన్‌డీఐఏ కూట‌మిపై ప‌రోక్ష వ్యాఖ్య‌లు చేశారు. మ‌న‌వ‌రాలి వ‌య‌సున్న ఓ యువ‌తిని ఇబ్బంది పెట్టే ప్ర‌శ్న‌లు వేశార‌ని అమిత్ మాల‌వీయ అన్నారు.

అయితే ఈ వీడియోపై ఉర్ఫానా మునీర్ ట్విట‌ర్‌లో స్పందించారు. ఫ‌రూక్‌తో సంభాష‌ణ చాలా బాగా జ‌రిగింద‌ని… ఆయ‌న త‌న‌ను కుమార్తెలా చూసుకున్నార‌ని తెలిపారు. వైర‌ల్ అవుతున్న వీడియోను అప‌హాస్యం చేయొద్ద‌ని విజ్ఞ‌ప్తి చేశారు.

Exit mobile version