విధాత: సొంత స్థలం ఉన్న అర్హులైన పేదలకు ఇంటి నిర్మాణం కోసం గృహలక్ష్మి పథకం కింద మూడు లక్షల ఆర్థిక సాయం చేసేందుకు విధివిధానాలు రూపొందించాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు ఇచ్చారు.
మంగళవారం సాయంత్రం ప్రగతిభవన్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో గృహలక్ష్మి పథకం మార్గదర్శకాలను ఖరారు చేయాలని సిఎస్ శాంతి కుమారిని ఆదేశించారు.
రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించాలని, పోడు భూముల పట్టాల పంపిణీ కోసం తేదీలను ప్రకటించాలని సిఎస్‌కు సూచించారు. అలాగే పంట నష్టపరిహారం పంపిణీకి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.