విధాత: పశ్చిమ బెంగాల్‌లోని అసన్‌సోల్ జిల్లా పశ్చిమ్ బర్ధమాన్‌లోని కుల్తీ రైల్వే స్టేషన్‌లో శనివారం ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను ఆర్పేందుకు చర్యలు చేపట్టారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.
#पश्चिम_बंगाल– आसनसोल में कुल्टी रेलवे स्टेशन पर लगी भीषण आग, दमकल की गाड़ियां मौके पर मौजूद।
.
.
.#WestBengal #KultiRailwayStation #Bardhaman #Fire #Asansol #PaschimBardhaman #WestBengalNews #abcnewsmedia pic.twitter.com/1MVmOggW34— Abcnews.media (@abcnewsmedia) November 25, 2023
అగ్ని ప్రమాదానికి సంబంధించిన విజువల్స్ సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. రైల్వేస్టేషనల్ భారీగా చెలరేగుతున్న మంటలు, దట్టమైన పొగ వ్యాపిస్తున్నట్టు విజువల్స్‌లో కనిపిస్తున్నది. మంటలు ఎందుకు చెలరేగాయి? దాని వల్ల ఎంత నష్టం జరిగింది? ఈ ఘటనలో ఏదైనా ప్రాణనష్టం, గాయాలు జరిగాయా అనేది తెలియరాలేదు. మంటలు అదుపులోకి వచ్చిన తర్వాత సమగ్ర విచారణ చేపట్టాలని అధికారులు భావిస్తున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు జరుపుతున్నారు.