విధాత, హైదరాబాద్: రాజధాని హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల్లో మంగళవారం ఉదయం భారీగా పొగమంచు పేరుకుపోయింది. శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని పొగమంచు దుప్పటి కమ్మేయడంతో.. విమాన రాకపోకలకు అంతరాయం కలిగింది.
విమానాశ్రయానికి వచ్చిన పలు విమానాలను అధికారులు దారి మళ్లించారు. ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు విమానం ముంబయి నుంచి హైదరాబాద్ రాగా.. ల్యాండింగ్‌కు వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో తిరిగి చెన్నైకి మళ్లించారు.