విధాత, మెదక్ బ్యూరో: మెదక్ జిల్లాలో సీనియర్ రాజకీయ నేత CDC మాజీ చైర్మన్ మెదక్ మండలం ర్యాల మడుగు గ్రామానికి చెందిన చిలుముల సిద్దరాం రెడ్డి (89) గుండె పోటుతో మృతి చెందారు. అనేక మార్లు ర్యాల మడుగు గ్రామానికి ఏకగ్రీవంగా సర్పంచ్ అయ్యారు. ఆయన కుమారుడు హనుమంత్ రెడ్డి మెదక్ pacs చైర్మన్ గా కొనసాగుతున్నారు.
మృతుడు సిద్దిరాం రెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏ.విఠల్ రెడ్డికి అత్యంత దగ్గరగా ఉండి కాంగ్రెస్ పార్టీ లో కొనసాగారు. గత కొంత కాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఆయన కుమారుడు హన్మంత్ రెడ్డి అధికార బీఆర్ ఎస్ పార్టీ లో ఉన్నారు. మృతుడు సిద్ది రాంరెడ్డి కి 5 గురు కుమారులు, 4 గురు కుమార్తెలు ఉన్నారు. మంజీర నది తీరంలో 100 ఎకరాల భూమికి పట్టాదారుగా వ్యవసాయంలో వివిధ వాణిజ్య పంటలను సాగు చేసేవారు. ఆయన మృతి పట్ల జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ లావణ్య రెడ్డి, ఎంపీపీ యమునా జయరాం రెడ్డి తదితరులు సంతాపం వ్యక్తం చేశారు.