విధాత: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఐన్యూస్ చానెల్ నుంచి తప్పుకున్నారని సమాచారం. ముఖ్యమంత్రి పదవి చేపట్టాక ఐన్యూస్ ఛానెల్ లో పార్టనర్ గా చేరారు నల్లారి.
సమైక్య నినాదం ఎత్తుకొని ఇటు తెలంగాణలో అటు ఆంధ్రప్రదేశ్ లో రాజకీయంగా ఇమేజ్ డ్యామేజ్ చేసుకున్నారు. అయితే కొంతకాలంగా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి ఏఐసీసీలో కీలక బాధ్యతలు అప్పచెప్తారని పొలిటికల్ సర్కిల్ లో ప్రచారం జరిగింది.
కానీ హై కమాండ్ ఆయన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఇటీవల రాహుల్ గాంధీ నిర్వహించిన జోడో యాత్రకు కూడా కిరణ్ కుమార్ రెడ్డికి ఆహ్వానం రాలేదు. దాంతో రాజకీయాల్లో పెద్దగా ప్రభావం చూపే అవకాశం లేకపోవడం తో ఛానెల్ ను కూడా లైట్ తీస్కున్నట్టు టాక్. అందుకే ఐన్యూస్ ఛానెల్ నుంచి పూర్తిగా తప్పుకున్నట్టు మీడియా వర్గాల్లో కూడా తెగ చర్చ జరుగుతుంది.