Botsa Satyanarayana: మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్య నారాయణకు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. విజయనగరం జిల్లా చీపురుపల్లిలో వెన్నుపోటు దినం కార్య క్రమంలో భాగంగా నిర్వహించిన భారీ ర్యాలీలో వేదికపై మాట్లాడుతుండగానే ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. కార్యకర్తలు వెంటనే ఆయనను గరివిడి ఆస్పత్రికి తరలించారు.
వేదిక పై ఉండగా వడ దెబ్బతో సొమ్మసిల్లిపోయినట్లుగా భావిస్తున్నారు. వైద్యులు గుండె సంబంధిత పరీక్షలు కూడా నిర్వహిస్తున్నారు. వైసీపీ సీనియర్ నేత ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో అభిమానులు, వైసీపీ శ్రేణులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ప్రస్తుతం బొత్స ఆసుపత్రిలో కోలుకుంటున్నట్లుగా సమాచారం. బొత్స సత్యనారాయణ కోలుకొంటున్నారని సోదరుడు అప్పల నర్సయ్య వెల్లడించారు. రెండేళ్ల క్రితం బొత్సకు ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగిందని..ఈరోజు వెన్నుపోటు దినోత్సవ ర్యాలీలో పాల్గొని అలసిపోవడం వల్ల కుప్పకూలారని తెలిపారు. ప్రస్తుతం బొత్స ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలిపారు.