Site icon vidhaatha

CM KCR – Foxconn | సీఎం కేసీఆర్‌కు ఫాక్స్‌కాన్ ఛైర్మన్ లేఖ

విధాత‌: తెలంగాణ(Telangana) ప్రభుత్వంతో ఇటీవల భారీ ఒప్పందం కుదుర్చుకున్న ఫాక్స్‌కాన్(Foxconn) టెక్నాలజీ గ్రూప్ ఛైర్మన్ యంగ్ లియు(Young Liu).. సీఎం కేసీఆర్‌(CM KCR)కు ప్రత్యేక లేఖ రాశారు.

మార్చి 2న జరిగిన సమావేశంలో తమ టీం హామీ ఇచ్చినట్టుగానే ఫాక్స్‌కాన్ పరిశ్రమను కొంగరకొలాన్‌(Kongarakolan) పార్క్‌లో వీలైనంత తొందరగా మానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏర్పాటు చేసి తీరుతామని అందుకు ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందన్న విశ్వాసం తమకు ఉందని ఆయన తన లేఖలో పేర్కొన్నారు.

అంతేకాక, తేవాన్‌లో పర్యటించాలని యంగ్ లియు కేసీఆర్‌ను ఆహ్వానించారు. ఫాక్స్‌కాన్ పరిశ్రమను తెలంగాణ లేదా కర్ణాటకలో ఎక్కడ ఏర్పాటు చేస్తారనే విషయంలో సందిగ్ధత నెలకొన్న వేళ దానికి తెరపడింది.

Exit mobile version