France | పదవీ విరమణ పెంపు.. ఫ్రాన్స్‌లో రోడ్డెక్కిన లక్షలాది మంది

విధాత‌: పదవీ విరమణ వయసును 62 నుంచి 64 ఏండ్లకు పెంచడానికి నిరసనగా ఫ్రాన్స్ (France ) లో నిరసనలు పది రోజులుగా సాగుతూనే ఉన్నాయి. పదవ రోజైన మంగళవారం నాడు దేశ వ్యాప్తంగా 240 ర్యాలీలలో లక్షలాది మంది నిరసనకారులు పాల్లొన్నారు. When 100 people protest against the Russian, Iranian, or Chinese govts, it's front page news for months, with Hollywood celebrities babbling all sorts of […]

  • Publish Date - March 29, 2023 / 05:00 PM IST

విధాత‌: పదవీ విరమణ వయసును 62 నుంచి 64 ఏండ్లకు పెంచడానికి నిరసనగా ఫ్రాన్స్ (France ) లో నిరసనలు పది రోజులుగా సాగుతూనే ఉన్నాయి. పదవ రోజైన మంగళవారం నాడు దేశ వ్యాప్తంగా 240 ర్యాలీలలో లక్షలాది మంది నిరసనకారులు పాల్లొన్నారు.

ప్యారిస్‌లోనే దాదాపు లక్ష మంది ప్రదర్శనలో పాల్గొన్నారు. అయితే ప్యారిస్‌లో నిరసన ప్రదర్శకుల సంఖ్య నాలున్నర లక్షలు ఉంటుందని జనరల్ ఫెడరేషన్ ఆఫ్ లేబర్ నాయకులు తెలిపారు. మార్చి ఏడవ తేదీన 13 లక్షల మంది ప్యారిస్ వీధుల్లో కదం తొక్కడంతో పోలిస్తే ఈ సంఖ్య తక్కువే.

నిరసన ప్రదర్శకులు పోలీసులపై రాళ్ళు, సీసాలు రువ్వారు. చెత్త కుండీలను తగుల బెట్టారు. పటాకలు కాల్చారు. వారిని చెదర గొట్టడానికి పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు. లియాన్ రైల్వే స్టేషన్ దగ్గర పట్టాలపై బైఠాయించారు. బియారిజ్ ఎయిర్ పోర్ట్ ప్రవేశ ద్వారం దగ్గర పొగ బాంబులు విసిరారు.

సాధారణ పౌరుల ఊరేగింపులో తీవ్ర వాద వర్గాలు కూడా పాల్గొన్నాయని ప్రభుత్వం ఆరోపించింది. 13 వేల మంది పోలీసు అధికారులను దేశవ్యాప్తంగా మోహరించింది. వీరిలో సగం మంది ప్యారిస్‌లోనే బందోబస్తు చర్యలు చేపట్టారు.

ఫింఛన్ సంస్కరణలకు వ్యతిరేకంగా ఫ్రాన్స్ లో ప్రజలు ఆందోళన చేయడానికి ఇతర కారణాలు కూడా ఉన్నాయి. దేశాధ్యక్షుడు మాక్రాన్ కార్మిక వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్నాడు. ప్రజల సంక్షేమ విధానాలంటే ఆయనకు గిట్టదు. నిరుద్యోగం పెరిగిపోయింది.

దేశ రుణ భారం జీడీపీలో 113 శాతానికి చేరుకున్నది. కార్మికుల ఉద్యోగాల సంఖ్య తగ్గిపోయింది. ఇప్పటికే రెండు సార్లు గెలిచిన మాక్రాన్ మరోసారి పోటీ చేయకూడదు. అందువల్ల ప్రజలు వ్యతిరేకించినా సరే పింఛన్ సంస్కరణలు చేపడుతున్నారు.

గతంలో ఒకసారి ఈ ప్రతిపాదనలకు వ్యతిరేకత రావడంతో వెనుకకు తగ్గారు. ఈ సారి పార్లమెంటు ఆమోదం లేకుండా తనకున్న కార్యనిర్వాహక అధికారాలతో చట్టాలను మార్చాలనుకోవడం ప్రజలలో ఆగ్రహం పెంచింది. మాక్రాన్ విధానాలు లూయిస్ 14ను తలపిస్తున్నాయనే విమర్శ ఉంది.