Gaddar Telangana Film Awards: తెలంగాణ ప్రభుత్వం గద్దర్ ఫిల్మ్ అవార్డులను ప్రకటించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాతా తొలిసారిగా.. 14 ఏళ్ల తర్వాత తెలంగాణలో సినిమా అవార్డ్స్ ను గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్సు పేరుతో ప్రకటించారు. ప్రముఖ నటి జయసుధ నేతృత్వంలో ఏర్పాటైన సినీ అవార్డుల జ్యూరీ కమిటీ, తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు ఆధ్వర్యంలో అవార్డుల ఎంపిక వివరాలను రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డికి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కకు అందచేశారు. అనంతరం గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ జ్యూరీ చైర్ పర్సన్ జయసుధ అవార్డు విజేతలను మీడియా సమావేశంలో ప్రకటించారు.
ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్..నటిగా నివేధా థామస్
ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్(పుష్పా 2), ఉత్తమ నటిగా నివేధా థామస్(35 చిన్న కథ కాదు), ఉత్తమ దర్శకుడిగా నాగ్ అశ్వీన్(కల్కీ), ఉత్తమ సహాయ నటుడిగా ఎస్ జే. సూర్య(సరిపోదా శనివారం).,ఉత్తమ సహాయ నటిగా శరణ్యా ప్రదీప్(అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్), ఉత్తమ సంగీత దర్శకుడు బీమ్(రజాకార్), ఉత్తమ గేయ రచయితగా చంద్రబోస్(రాజు యాదవ్), ఉత్తమ గాయకుడిగా సిథ్ శ్రీరామ్((ఊరుపేరు బైరవకోన..నిజంనేను చెబుతున్నా), ఉత్తమ గాయనిగా శ్రేయో ఘోషల్(పుష్పా 2 చూసేకీ అగ్గిరవ్వ) ఎంపికయ్యారు. ఉత్తమ హాస్య నటుడిగా సత్య, వెన్నెల కిషోర్(మత్తు వదలరా 2), ఉత్తమ బాల నటులు మాస్టర్ అరుణ్ దేవ్ పోతుల, బేబీ హారిక(35చిన్నకథకాదు, మెర్సి కిల్లింగ్), ఉత్తమ కథా రచయితగా శివ పాలడుగు(మ్యూజిక్ షాప్ మూర్తి),ఉత్తమ స్క్రీన్ ప్లే రైటర్ గా వెంకి అట్లూరి(లక్కీ భాస్కర్),
ఉత్తమ చిత్రంగా కల్కి 2898 ఏడీ
ఉత్తమ చిత్రంగా కల్కి 2898 ఏడీ ఎంపికైంది. ద్వితీయ ఉత్తమ చిత్రంగా పొట్టేల్, తృతీయ ఉత్తమ సినిమాగా లక్కీ భాస్కర్ ఎంపికైంది. ఉత్తమ జాతీయ సమగ్రత చిత్రంగా కమిటీ కుర్రోళ్లు, ఉత్తమ బాలల చిత్రంగా 35చిన్నకథ కాదు, ఉత్తమ చరిత్ర ఫ్యూచర్ హెరిటేజ్ చిత్రంగా రజాకార్, ఉత్తమ ప్రజాదరణ చిత్రం ఆయ్..మేము ఫ్రెండ్స్ అండీ ఎంపికయ్యాయి.
ఉత్తమ నూతన దర్శకుడు యధు వంశీ(కమిటీ కుర్రోళ్లు), ఉత్తమ సినిమాటోగ్రాఫర్ విశ్వనాథ్ రెడ్డి(గామి), ఉత్తమ ఎడిటర్ గా నవీన్ నూలీ(లక్కీ భాస్కర్), ఉత్తమ ఆడియోగ్రాఫర్ గా ఆర్వింద్ మీనన్(గామి), ఉత్తమ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య(దేవర), బెస్టు ఆర్ట్ డైరక్టర్ అనిథిన్ జిహాని చౌదరి(కల్కీ 2898), ఉత్తమ యాక్షన్ కొరియోగ్రాఫర్ గా కే.చంద్రశేఖర్ రాథోడ్(గ్యాంగ్ స్టర్), ఉత్తమ మేకప్ అర్టిస్టుగా నల్ల శ్రీను(రజాకార్), ఉత్తమ కాస్టూమ్ డిజైనర్ గా అర్చనా రావు, అజయ్ కుమార్ (కల్కి 2898 ఏడీ) లు ఎంపికయ్యారు. స్పెషల్ జ్యూరీ అవార్డులలో దుల్కర్ సల్మాన్(లక్కీ భాస్కర్), అనన్య నాగెళ్ల(పొట్టెల్), సుజిత్, సందీప్ (క), ప్రశాంత్ రెడ్డి, రాజేష్ కల్లెపల్లి(రాజు యాదవ్), జ్యూరీ స్పెషల్ మెన్షన్ అవార్డు ఫరియా అబ్ధుల్లా(మత్తు వదలారా 2 సాంగ్), తెలుగు సినిమాలపై ఉత్తమ పుస్తకంగా మన సినిమా ఫస్ట్ రీల్(రెంటాల జయదేవ్) లను ఎంపిక చేశారు.