స్నేహితుడిని బ‌లి తీసుకున్న ప్రియురాలి న‌గ్న వీడియోలు

విధాత‌: ప్రియురాలి న‌గ్న వీడియోలు స్నేహితుడి ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. ఈ దారుణ ఘ‌ట‌న క‌ర్నూల్ న‌గ‌రంలో జ‌న‌వ‌రి 25వ తేదీన చోటు చేసుకోగా, ఆల‌స్యంగా వెలుగు చూసింది. వివ‌రాల్లోకి వెళ్తే.. కర్నూల్ మండ‌లం బాలాజీన‌గ‌ర్‌కు చెందిన ఎరుక‌లి దినేశ్ డిగ్రీ చ‌దువుతున్నాడు. దినేశ్ ఓ యువ‌తిని ప్రేమిస్తున్నాడు. అయితే దినేశ్ త‌న ల‌వ‌ర్‌తో స‌న్నిహితంగా ఉన్న దృశ్యాల‌తో పాటు ఆమె న‌గ్న వీడియోల‌ను త‌న ఫోన్‌లో దాచి ఉంచాడు. దినేశ్ స్నేహితుడైన మ‌ల్లెపోగు ముర‌ళీకృష్ణ‌(22) ఆ […]

  • Publish Date - February 24, 2023 / 04:37 AM IST

విధాత‌: ప్రియురాలి న‌గ్న వీడియోలు స్నేహితుడి ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. ఈ దారుణ ఘ‌ట‌న క‌ర్నూల్ న‌గ‌రంలో జ‌న‌వ‌రి 25వ తేదీన చోటు చేసుకోగా, ఆల‌స్యంగా వెలుగు చూసింది.

వివ‌రాల్లోకి వెళ్తే.. కర్నూల్ మండ‌లం బాలాజీన‌గ‌ర్‌కు చెందిన ఎరుక‌లి దినేశ్ డిగ్రీ చ‌దువుతున్నాడు. దినేశ్ ఓ యువ‌తిని ప్రేమిస్తున్నాడు. అయితే దినేశ్ త‌న ల‌వ‌ర్‌తో స‌న్నిహితంగా ఉన్న దృశ్యాల‌తో పాటు ఆమె న‌గ్న వీడియోల‌ను త‌న ఫోన్‌లో దాచి ఉంచాడు.

దినేశ్ స్నేహితుడైన మ‌ల్లెపోగు ముర‌ళీకృష్ణ‌(22) ఆ న‌గ్న వీడియోల‌ను త‌న ఫోన్‌లోకి పంపించుకున్నాడు. ఆ న‌గ్న వీడియోల‌తో దినేశ్ ప్రియురాలిని ముర‌ళీకృష్ణ వేధించ‌డం మొద‌లుపెట్టాడు. కుటుంబ స‌భ్యుల‌కు, బంధువుల‌కు ఆ వీడియో పంపుతాన‌ని బెదిరింపుల‌కు గురి చేశాడు.

ముర‌ళీకృష్ణ వేధింపులు తాళ‌లేక‌.. బాధిత యువ‌తి ఇటీవ‌ల ఆత్మ‌హ‌త్య‌కు య‌త్నించి ఆస్ప‌త్రి పాలైంది. ఈ క్ర‌మంలో దినేశ్ ముర‌ళీకృష్ణ‌పై ప‌గ పెంచుకున్నాడు. ఎలాగైనా అత‌న్ని అంత‌మొందించాల‌ని దినేశ్ నిశ్చ‌యించుకున్నాడు.

ఈ క్ర‌మంలో కిర‌ణ్ కుమార్ అనే మ‌రో ఫ్రెండ్‌తో దినేశ్.. ముర‌ళీకృష్ణ హ‌త్య‌కు సంబంధించిన ప్ర‌ణాళిక‌ను సిద్ధం చేశాడు. శివ‌మాల ధ‌రించిన ముర‌ళీకృష్ణ‌ను జ‌న‌వ‌రి 25వ తేదీన పంచ‌లింగాల ప్రాంతానికి తీసుకెళ్లి, క‌త్తితో పొడిచి చంపారు. మృత‌దేహాన్ని గోనెసంచిలో కుక్కి.. అక్క‌డ్నుంచి ఆటోలో హెచ్ఎన్ఎస్ఎస్ కెనాల్ వ‌ద్ద‌కు తీసుకెళ్లి ప‌డేశారు. మృతుడి మొబైల్, దుస్తుల‌ను వేర్వేరు ప్రాంతాల్లో ప‌డేసి వెళ్లిపోయారు దినేశ్, కిర‌ణ్‌.

త‌మ కుమారుడు క‌నిపించ‌డం లేదంటూ.. ఈ నెల 16న క‌ర్నూల్ తాలుకా అర్బ‌న్ పోలీసుల‌కు ముర‌ళీ కృష్ణ త‌ల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు, విచార‌ణ‌లో భాగంగా దినేశ్‌ను అదుపులోకి తీసుకున్నారు. దినేశ్‌ను విచారించగా అస‌లు విష‌యం బ‌య‌ట‌ప‌డింది. దీంతో ముర‌ళీకృష్ణ మృత‌దేహం కోసం హంద్రీనీవా కాలువ‌లో పోలీసులు గాలిస్తున్నారు.

Latest News