Site icon vidhaatha

Nalgonda: గుండెపోటుతో గీత కార్మికుడి మృతి

విధాత: నల్గొండ జిల్లా ఖాజీరామారం గ్రామానికి చెందిన కల్లుగీత కార్మికుడు పాలకూర సైదులు గురువారం గుండెపోటుతో మృతి చెందాడు. ఉదయం అకస్మాత్తుగా చాతిలో నొప్పితో విలవిలాడిపోతుండగా కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు. మార్గమధ్యలోనే సైదులు ప్రాణాలు కోల్పోయారు.

సైదులు గీత కార్మికుడిగా, వ్యవసాయ కూలీగా, హమాలిగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ప్రభుత్వం సైదులు కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Exit mobile version