Medak: శోభాయమానంగా.. హనుమాన్ ‘శోభాయాత్ర’.. మార్మోగిన వీరాంజ‌నేయ‌ నామస్మరణ

పట్టణమంతటా రెపరెపలాడిన కాషాయ జెండాలు అధిక సంఖ్య‌లో త‌ర‌లి వ‌చ్చిన భ‌క్తులు భారీ బందోబస్తు నడమ సాగిన యాత్ర… విధాత, మెదక్ బ్యూరో: హనుమాన్ జయంతి సందర్భంగా బుధవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన వీరహనుమాన్‌ శోభాయాత్ర శోభాయమానంగా సాగింది. భారీ సంఖ్యలో తరలి వచ్చిన భక్తులతో, కాషాయవర్ణ శోభిత నిలువెత్తు హనుమాన్‌ జెండాలతో నిర్వహించిన ప్రదర్శన ఉత్సాహంగా సాగింది. విశ్వహిందూ పరిషత్, బజరంగ్‌దళ్‌ల ఆధ్వర్యంలో జరిగిన ఈ యాత్రకు జిల్లా నలు మూలల నుంచి వందలాదిగా భక్తులు […]

  • Publish Date - April 5, 2023 / 03:56 PM IST
  • పట్టణమంతటా రెపరెపలాడిన కాషాయ జెండాలు
  • అధిక సంఖ్య‌లో త‌ర‌లి వ‌చ్చిన భ‌క్తులు
  • భారీ బందోబస్తు నడమ సాగిన యాత్ర…

విధాత, మెదక్ బ్యూరో: హనుమాన్ జయంతి సందర్భంగా బుధవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన వీరహనుమాన్‌ శోభాయాత్ర శోభాయమానంగా సాగింది. భారీ సంఖ్యలో తరలి వచ్చిన భక్తులతో, కాషాయవర్ణ శోభిత నిలువెత్తు హనుమాన్‌ జెండాలతో నిర్వహించిన ప్రదర్శన ఉత్సాహంగా సాగింది. విశ్వహిందూ పరిషత్, బజరంగ్‌దళ్‌ల ఆధ్వర్యంలో జరిగిన ఈ యాత్రకు జిల్లా నలు మూలల నుంచి వందలాదిగా భక్తులు తరలి వచ్చారు. ప్రత్యేక వాహనాలపై శ్రీరాముడు, హనుమంతుడు, శివాజీ విగ్రహాలను ఊరేగింపు నిర్వహించారు.

శ్రీ కోదండ రామాలయం నుంచి రాందాస్ చౌరస్తా పాత బస్టాండ్, గోల్కొండ, మార్కెట్, పిట్లం బేస్, చమన్, ఫతేనగర్, న్యూ బస్టాండ్ మీదుగా శోభాయాత్ర సాగింది. హనుమాన్ స్వాములు, భజరంగ్ ధళ్ కార్యకర్తలు భక్తిపారవశ్యంలో మునిగిపోయారు. హనుమాన్ స్వాములు, భక్తులు చేసిన జై శ్రీరాం, జై హనుమాన్ నినాదాలు మారిమోగిపోయాయి. నృత్యాలు, భజనలు, కీర్తనలు పట్టణవాసులను ఆకట్టుకున్నాయి.

ఎలాంటి అవాంచనీయ సంఘటణలు చోటుచేసుకోకుండా స్పీ ఆదేశాల మేరకు డీఎస్పీ సైదులు సూచనలతో పట్టణ సీఐ సంజయ్ ఆధ్వర్యంలో గట్టి బందోబస్తు చర్యలు చేపట్టారు. కార్యక్రమంలో rss విబాగ్ కార్యవహ నాగభూషణం, జిల్లా అధ్యక్షులు పబ్బ సత్యనారాయణ, vhp సంఘటన కార్యదర్శి పుట్టి మల్లేశం, పట్టణ అధ్యక్షుడు అరవింద్, అప్పల సునీల్, రాంచందర్, మల్కాజ్ సత్యనారాయణ, బీజేపి జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్త దితరులు పాల్గొన్నారు.

నేడు హనుమాన్ జయంతి వేడుకలకు ఏర్పాట్లు..

మెదక్ పట్టణంలోని పంచముఖి హ‌నుమాన్ ఆలయంలో గురువారం హనుమాన్ జయంతి ఉత్సవాలకు ఘ‌నంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయ పూజారి కాకులవరం మర్సనాచార్యులు ఆధ్వర్యంలో హోమము, ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరగనున్నాయి. భక్తులకు అన్నదానం నిర్వహించనున్నారు.