విధాత: బంగారం ధరలు మగువలకు ఊరటనిచ్చాయి. ఇటీవల పెరుగుతూ వస్తున్న ధరలు గురువారం బులియన్ మార్కెట్‌లో స్థిరంగా కొనసాగుతున్నాయి. మరో వైపు వెండి ధరలు సైతం నిలకడగా కొనసాగుతున్నాయి. 22 క్యారెట్ల పసిడి రూ.56,850 వద్ద కొనసాగుతుండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.62,020 పలుకుతున్నది. దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం రూ.57,300 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి రూ.62,510 వద్ద నిలకడగా ఉన్నది.
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల గోల్డ్ రూ.57వేలు ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి రూ.62,170 వద్ద కొనసాగుతున్నది. ముంబయిలో 22 క్యారెట్ల గోల్డ్ రూ.56,850 ఉండగా.. 24 క్యారెట్ల స్వర్ణం రూ.62,020 వద్ద స్థిరంగా ఉన్నది. ఇక హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి రూ.56,850 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.62,020 వద్ద కొనసాగుతున్నది. ఏపీలోని విజయవాడ, విశాఖపట్నం, తిరుపతితో పాటు పలు నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. మరో వైపు వెండి హైదరాబాద్‌లో కిలోకు రూ.79వేలు పలుకుతున్నది.