స్వల్పంగా తగ్గిన గోల్డ్‌ రేటు.. హైదరాబాద్‌లో నేటి ధరలు ఇవే..!

బంగారం ధరలు కొనుగోలుదారులకు స్వల్పంగా ఊరటనిచ్చాయి. బులియన్‌ మార్కెట్‌లో ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి

  • Publish Date - November 24, 2023 / 04:04 AM IST

విధాత‌: బంగారం ధరలు కొనుగోలుదారులకు స్వల్పంగా ఊరటనిచ్చాయి. బులియన్‌ మార్కెట్‌లో ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. 22 క్యారెట్ల గోల్డ్‌పై రూ.50 తగ్గి తులానికి రూ.56,800 పలుకుతున్నది. 24 క్యారెట్ల బంగారంపై రూ.50 తగ్గి తగ్గగా తులానికి రూ.61,970కి తగ్గింది. దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.56,950 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ.62,120 వద్ద కొనసాగుతున్నది.


ముంబయిలో 22 క్యారెట్ల గోల్డ్‌ రేట్‌ రూ.56,800 ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి రూ.61,970 వద్ద ట్రేడవువుతున్నది. ఇక చెన్నైలో 22 క్యారెట్ల బంగారం రూ.57,350 ఉండగా.. 24 క్యారెట్ల స్వర్ణం రూ.62,550 వద్ద కొనసాగుతున్నది. ఇక హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి రూ.56,800 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ.61,970 పలుకుతున్నది. ఏపీలోని తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం తదితర నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. మరో వైపు వెండి ధర స్వల్పంగా పెరిగింది. కిలోకు రూ.200 పెరిగి రూ.76,200కి చేరింది. ఇక హైదరాబాద్‌లో కిలో వెండి రూ.79,200 పలుకుతోంది.