పుత్తడి ప్రియులకు గుడ్‌న్యూస్‌.. స్వల్పంగా తగ్గిన బంగారం..!

  • Publish Date - October 5, 2023 / 04:54 AM IST

విధాత‌: బంగారం ప్రియులకు శుభవార్త. మొన్నటి వరకు భారీగా పెరిగిన బంగారం ధరలు ఇటీవల వరుసగా దిగివస్తున్నాయి. తాజాగా గురువారం సైతం స్వల్పంగా ధలు పతనమయ్యాయి. తులం బంగారానికి రూ.10 తగ్గింది. 22 క్యారెట్ల బంగారం రూ.57,370 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ.57,530 పలుకుతున్నది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. ఢిల్లీలో 22 క్యారెట్ల గోల్డ్‌ రూ.52,750 ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి రూ.57,530 పలుకుతున్నది.


చెన్నైలో 22 క్యారెట్ల బంగారం రూ.52,850 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి రూ.57,650 వద్ద కొనసాగుతున్నది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి రూ.52,590 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ.57,370 పలుకుతున్నది. ఏపీలోని విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. మరో వైపు వెండి ధరలు సైతం స్వల్పంగా తగ్గాయి. కిలోకు రూ.300 కిలోకు రూ.300 తగ్గుముఖం పట్టింది. హైదరాబాద్‌లో కిలోకు రూ.73,100 పలుకుతున్నది.