Gold Rates | మగువలకు బంగారం ధరలు షాకిచ్చాయి. బులియన్ మార్కెట్‌లో పుత్తడి ధరలు స్వల్పంగా పెరిగాయి. 22 క్యారెట్ల గోల్డ్‌పై రూ.100 పెరిగి తులానికి రూ.58,500కి పెరిగింది. 24 క్యారెట్ల పసిడిపై రూ.110 తులానికి రూ.63,490కి ఎగిసింది. దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం రూ.59వేలు ఉండగా.. 24 క్యారెట్ల పసిడి రూ.64,360కి చేరింది. ముంబయిలో 22 క్యారెట్ల బంగారం రూ.58,500 ఉండగా.. 24 క్యారెట్ల స్వర్ణం రూ.63,820కి ఎగిసింది.
ఢిల్లీలో 22 క్యారెట్ల పుత్తడి రూ.58,650 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.63,960కు పెరిగింది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి రూ.58,500 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.63,820 పలుకుతున్నది. ఏపీలోని విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. మరో వైపు వెండి ధర స్వల్పంగా దిగివచ్చింది. రూ.300 తగ్గి కిలోకు రూ.79,200కి చేరింది. హైదరాబాద్‌లో కిలో వెండి రూ.80,700 పలుకుతున్నది.