కొనుగోలుదారులకు రిలీఫ్‌.. నేడు బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..?

మొన్నటి వరకు విపరీతంగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు ప్రస్తుతం నిలకడగా కొనసాగుతున్నాయి

  • Publish Date - January 8, 2024 / 06:41 AM IST

Gold Rates | మొన్నటి వరకు విపరీతంగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు ప్రస్తుతం నిలకడగా కొనసాగుతున్నాయి. వరుసగా రెండోరోజూ బంగారం, వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. 22 క్యారెట్ల గోల్డ్‌ రూ.58వేలు, 24 క్యారెట్ల పసిడి రూ.63,270 వద్ద కొనసాగుతున్నది. దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే చెన్నైలో 22 క్యారెట్ల బంగారం రూ.58,600 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి రూ.63,930 వద్ద స్థిరంగా ఉన్నది. ముంబయిలో 22 క్యారెట్ల బంగారం రూ.58వేలు ఉండగా.. 24 క్యారెట్ల స్వర్ణం రూ.63,270 పలుకుతున్నది.


ఢిల్లీలో 22 క్యారెట్ల పుత్తడి రూ.58,150 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.63,400 వద్ద ట్రేడవుతున్నది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి రూ.58వేలు ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.63,270 పలుకుతున్నది. ఏపీలోని విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. మరో వైపు వెండి ధరలు నిలకడగానే ఉన్నాయి. హైదరాబాద్‌లో కిలో వెండి రూ.78వేల వద్ద స్థిరంగా ఉన్నది. ప్లాటినం సైతం ధర స్థిరంగా ఉన్నది. ప్రస్తుతం తులం రూ.25,740 వద్ద ట్రేడవుతున్నది.