Gold Prices: బంగారం ధరలు హెచ్చతగ్గుల మధ్య కొనుగోలు దారులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. బులియన్ మార్కెట్ లో మరోసారి బంగారం ధరలు స్వల్ప పెరుగుదలను నమోదు చేశాయి. మంగళవారం హైదరాబాద్ మార్కెట్ లో 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.150పెరిగి రూ.87,650వద్ద ఉంది. 24క్యారెట్ల 10గ్రాముల రూ.160 పెరిగి రూ.95,620వద్ధ కొనసాగుతుంది. బెంగుళూరు, ముంబై, చెన్నైలలో అవే ధరలు కొనసాగుతున్నాయి. న్యూఢిల్లీలో 22క్యారెట్లకు రూ.87,800, 24క్యారెట్లకు 95,770గా ఉంది.
దుబాయ్ లో 22క్యారెట్లకు రూ.83,845, 24క్యారెట్లకు రూ.90,605గా ఉంది. అమెరికాలో రూ.83,332, రూ.88,859గా ఉంది. వెండి ధరలు తగ్గుదల నమోదు చేశాయి. కిలో వెండి ధర రూ.1000తగ్గి రూ.1,09,000గా కొనసాగుతుంది.