Site icon vidhaatha

Gold Prices: బంగారం ధరలలో స్వల్ప ఊరట

Gold Prices:  పెళ్లిళ్ల సీజన్ వేళ బంగారం ధరలు భారతీయులను భయపెడుతున్నాయి. ఆల్ టైమ్ రికార్డుతో తులం బంగారం లక్ష రూపాయలు దాటేసినప్పటికి బుధవారం కొంత తగ్గుముఖం పట్టాయి.  ఒక విధంగా చూస్తే ఇప్పటికే ఆకాశాన్ని తాకిన పసిడి ధరలతో సామాన్యుడు ఇక బంగారం కొనగలమా అనే ఆందోళనకు గురిచేస్తుంది. హైదరాబాద్ మార్కెట్ లో 22క్యారెట్ల 10గ్రాముల ధర రూ.2,750తగ్గి రూ.90,150 వద్ధ కొనసాగుతుంది. 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.3000తగ్గి రూ.98,350వద్ద కొనసాగుతోంది.

బెంగుళూరు, చైన్నై, ముంబాయి లలో అవే ధరలు కొనసాగుతున్నాయి. న్యూఢిల్లీలో 22క్యారెట్లకు రూ.90,300, 24క్యారెట్లకు రూ.98,500ధర కొనసాగుతుంది. దుబాయ్ లో 22క్యారెట్లకు రూ.86,886, 24క్యారెట్లకు రూ.93,807గా ఉంది. అమెరికాలో 22క్యారెట్లకు రూ.88,424, 24క్యారెట్లకు రూ.94,404గా ఉంది.


వెండి ధరలు నిలకడగా ఉన్నాయి. కిలో వెండి ధర రూ.1,11,000వద్ధ కొనసాగుతోంది.

Exit mobile version