మహిళకు రిలీఫ్‌..దిగివస్తున్న బంగారం ధరలు.! హైదరాబాద్‌లో ఎలా ఉన్నాయంటే?

ఇటీవలకాలంలో బంగారం ధరలు విపరీతంగా పెరుగుతూ వస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా రికార్డు స్థాయికి చేరాయి

  • Publish Date - December 7, 2023 / 03:44 AM IST

విధాత‌: ఇటీవలకాలంలో బంగారం ధరలు విపరీతంగా పెరుగుతూ వస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా రికార్డు స్థాయికి చేరాయి. అయితే, నిన్న భారీగా తగ్గిన బంగారం ధరలు గురువారం మరోసారి తగ్గుముఖం పట్టాయి. 22 క్యారెట్ల గోల్డ్‌పై రూ.400 తగ్గి తులానికి రూ.57,450 పలుకుతున్నది. 24 క్యారెట్ల బంగారంపై రూ.440 పెరిగి తులం రూ.62,670 వద్ద స్థిరపడింది.


దేశంలోని వివిధ నగరాల్లోనూ బంగారం ధలను పరిశీలిస్తే.. దేశ రాజధాని ఢిల్లీ నగరంలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.57,600 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.62,850 పలుకుతున్నది. ముంబయిలో 22 క్యారెట్ల గోల్డ్‌ రూ.57,450 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి రూ.62,670కి తగ్గింది. చెన్నైలో 22 క్యారెట్ల పుత్తడి రూ.58,150 ఉండగా.. 24 క్యారెట్ల స్వర్ణం రూ.63,440కి చేరింది.


ఇక హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి రూ.57,450 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ.62,670 పలుకుతున్నది. ఏపీలోని తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లోనే ఇవే ధరలు కొనసాగుతున్నాయి. మరో వెండి వెండి ధరలు సైతం స్వల్పంగా తగ్గింది. రూ.300 తగ్గి కిలోకు రూ.78,200కి తగ్గింది. హైదరాబాద్‌లో కిలో బంగారం రూ.81వేలు పలుకుతున్నది.