Gold Rates | బంగారం, వెండి ధరలు కొనుగోలుదారులకు స్వల్ప ఊరటనిచ్చాయి. ఇటీవల భారీగా పెరుగుతున్న స్వల్పంగా దిగివచ్చాయి. 22 క్యారెట్ల గోల్డ్‌పై రూ.450 తగ్గి తులానికి రూ.57,300కి తగ్గింది. 24 క్యారెట్ల బంగారంపై రూ.490 పతనమై.. తులానికి రూ.62,510కి దిగివచ్చింది. వెండి కిలోకు రూ.800పైగా తగ్గింది. దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసడి రూ.57,450 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.62,660 పలుకుతున్నది.
ముంబయిలో 22 క్యారెట్ల పుత్తడి రూ.57,300 ఉండగా.. 24 క్యారెట్ల స్వర్ణం రూ.62,510కి చేరింది. చెన్నైలో 22 క్యారెట్ల పసిడి రూ.57,900 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.63,160కి తగ్గింది. ఇక హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి రూ.57,300 ఉండగా.. 24 క్యారెట్ల స్వర్ణం రూ.62,510 పలుకుతున్నది. ఏపీలోని విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ఇక వెండి ధర భారీగానే తగ్గింది. రూ.800 తగ్గి కిలో వెండి రూ.77,700 పలుకుతున్నది. హైదరాబాద్‌లో వెండి కిలోకు రూ.79,700 పలుకుతున్నది.