విధాత: మరోసారి బంగారం, వెండి ధరలు కొనుగోలుదారులకు షాక్ ఇచ్చాయి. బులియన్ మార్కెట్‌లో బుధవారం మరోసారి ధరలు పెరిగాయి. 22 క్యారెట్ల పుత్తడిపై రూ.350 పెరిగి తులానికి రూ.56,850 పలుకుతున్నది. ఇక 24 క్యారెట్ల గోల్డ్‌పై రూ.380 పెరగ్గా తులానికి రూ.62,020కి చేరింది. అదే సమయంలో వెండి ధర సైతం పైకి కదిలింది. కిలోకు రూ.400 పెరగడంతో కిలోకు రూ.76,400 పెరిగింది. దేశంలోని వివిధ నగరాల్లోను బంగారం ధరలను పరిశీలిస్తే.. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం రూ.57వేలు ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి రూ.62,170 పలుకుతున్నది.
ముంబయిలో 22 క్యారెట్ల స్వర్ణం రూ.56,850 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.62,020కి చేరింది. చెన్నైలో 22 క్యారెట్ల గోల్డ్ రూ.57,300 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.62,510 పలుకుతున్నది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం రూ.56,850 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.62,020కి ఎగిసింది. ఇక హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం రూ.56,850 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.62,020 పలుకుతున్నది. ఇక వెండి విషయానికి వస్తే కిలోకు రూ.400 తగ్గుముఖం పట్టింది. హైదరాబాద్‌లో కిలో వెండి రూ.79,400 వద్ద కొనసాగుతున్నది.