మెదక్: జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు పూర్తి: క‌లెక్ట‌ర్ హ‌రీశ్‌

81,500 మంది రైతుల నుంచి.. 3లక్షల 90 వేల500 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ విధాత, మెదక్ ఉమ్మడి జిల్లా బ్యూరో: జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ వేగవంతంగా పూర్తి చేశామని జిల్లా కలెక్టర్ ఎస్.హరీష్ ఆదివారం తెలిపారు. ఈ వానాకాలంలో 6 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేసి అందుకనుగుణంగా ప్రాథమిక వ్యవసాయ సహాకార సంఘాలు, ఐ.కె.పి, మార్కెట్ కమిటీ, రైతు ఉత్పత్తి సంఘాల ఆధ్వర్యంలో 410 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు […]

  • Publish Date - December 11, 2022 / 03:50 PM IST
  • 81,500 మంది రైతుల నుంచి..
  • 3లక్షల 90 వేల500 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ

విధాత, మెదక్ ఉమ్మడి జిల్లా బ్యూరో: జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ వేగవంతంగా పూర్తి చేశామని జిల్లా కలెక్టర్ ఎస్.హరీష్ ఆదివారం తెలిపారు. ఈ వానాకాలంలో 6 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేసి అందుకనుగుణంగా ప్రాథమిక వ్యవసాయ సహాకార సంఘాలు, ఐ.కె.పి, మార్కెట్ కమిటీ, రైతు ఉత్పత్తి సంఘాల ఆధ్వర్యంలో 410 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు.

ఈ కేంద్రాల ద్వారా 81,500 మంది రైతుల నుండి 806 కోట్ల రూపాయల విలువ గల 3 లక్షల 90 వేల 500 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని కలెక్టర్ పేర్కొన్నారు. 90 శా తం ట్యాబ్ ఎంట్రీ కూడా పూర్తి చేసి 72,979 మంది రైతులకు 670 కోట్ల రూపాయల డబ్బును వారి ఖాతాలో జమ చేశామని ఆయన తెలిపారు. మిగతా రైతులకు కూడా త్వరలో డబ్బులు వారి ఖాతాలో వేస్తామని వివరించారు.

నిజామామాబాద్, కామారెడ్డి జిల్లాల తరువాత అత్యధికంగా ధాన్యం సేకరణ మన మెదక్ జిల్లాలోనే జరిగిందని అన్నారు. రాష్ట్ర ఆర్థిక‌, వైద్య ఆరోగ్య శాఖామాత్యులు, ప్రజాప్రతినిధులు, అధికారుల సమన్వయం, సమిష్టి కృషి వల్ల గత అక్టోబర్ 26 న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి శరవేగంతో ధాన్యం కొనుగోలు చేసి శనివారం నాటికి నిజాంపేట్‌లో చివరి కొనుగోలు కేంద్రంలో ధాన్యం కొనుగోళ్లు చేసి ప్రక్రియ పూర్తి చేశామన్నారు.

కేవలం 40 రోజులలోనే 3.90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని, మరో 2లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వ్యాపారస్తులు రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేశారని కలెక్టర్ తెలిపారు. రైతులకు సకాలంలో డబ్బులు అందజేశామని, కాబట్టి రబీ పంటకు సంబంధించి తొందరగా వరినార్లు విత్తితే ఏప్రిల్ నాటికి పంట దిగుబడి వస్తుందని కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా ధాన్యం సేకరణలో సహకరించిన రైస్ మిల్లుల యాజమాన్యానికి, కేంద్రం నిర్వాహకులకు, ప్రతి ఒక్కరికి కలెక్టర్ ధన్యవాదాలు తెలిపారు.