Site icon vidhaatha

Group-2 | ఫ‌లించిన అభ్య‌ర్థుల పోరాటం.. గ్రూప్ -2 న‌వంబ‌ర్‌కు వాయిదా

Group-2 |

గ్రూప్-2 అభ్య‌ర్థుల పోరాటం ఫ‌లించింది. ఎట్ట‌కేల‌కు కేసీఆర్ స‌ర్కార్ దిగొచ్చింది. గ్రూప్-2 అభ్య‌ర్థులు, ప్ర‌తిప‌క్షాల ఆందోళ‌న‌ల‌తో గ్రూప్-2 వాయిదా వేయ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి ఏర్ప‌డింది. గ్రూప్-2 ప‌రీక్ష‌ను రీషెడ్యూల్ చేయాల‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఆదేశించిన‌ట్లు రాష్ట్ర మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.

టీఎస్‌పీఎస్సీతో చ‌ర్చించాల‌ని ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శాంతికుమారికి కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ల‌క్ష‌లాది మంది అభ్య‌ర్థుల‌కు ఇబ్బంది క‌ల‌గ‌కుండా చూడాల‌ని కేసీఆర్ సూచించారు. దీంతో ఈ నెల 29, 30వ తేదీన నిర్వ‌హించాల్సిన గ్రూప్-2 ప‌రీక్ష‌ల‌ను న‌వంబ‌ర్ నెల‌కు వాయిదా ప‌డ్డాయి.

భ‌విష్య‌త్‌లో విడుద‌ల చేసే నోటిఫికేష‌న్ల విష‌యంలోనూ అభ్య‌ర్థుల‌కు ఇబ్బంది లేకుండా చూడాల‌న్నారు. అభ్య‌ర్థులు పోటీ ప‌రీక్ష‌ల‌కు స‌న్న‌ద్ధ‌మ‌య్యేందుకు స‌మ‌యం ఇవ్వాల‌ని సూచించారు కేసీఆర్. గ్రూప్-2 ప‌రీక్ష‌ల‌ను మూడు నెల‌ల పాటు వాయిదా వేయాల‌ని దాదాపు 10 వేల మంది నిరుద్యోగ అభ్య‌ర్థులు నిన్న టీఎస్‌పీఎస్సీ కార్యాల‌యాన్ని ముట్ట‌డించిన ప‌రిస్థితులు తీవ్ర ఉద్రిక్త‌త‌ల‌కు దారి తీసిన సంగ‌తి తెలిసిందే.

Exit mobile version