Site icon vidhaatha

Shooting Incident: అమెరికాలో దుండగుడి కాల్పులు..చిన్నారి సహా ముగ్గురు మృతి!

Shooting incident | అమెరికాలో మరోసారి కాల్పుల ఘటన (Shooting incident) కలకలం రేపింది. ఉటా రాష్ట్రంలోని సెంటెనియల్‌ పార్క్‌‌లో నిర్వహించిన వెస్ట్‌ఫెస్ట్‌ కార్నివాల్‌లో దుండగుడు జరిపిన తుపాకీ కాల్పులలో నెలల చిన్నారి సహా ముగ్గురు మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. చనిపోయినవారిలో 8 నెలల శిశువు, ఓ యువకుడు, మరో మహిళ ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. పార్కులో రెండు వేర్వేరు గుంపుల మధ్య నెలకొన్న వివాదం ఘర్షణకు దారి తీసింది.

దీంతో 16 ఏళ్ల యువకుడు తన వద్ద ఉన్న తుపాకీతో ప్రత్యర్థి గుంపుపై కాల్పులు జరుపడంతో ముగ్గురు మరణించారు. అయితే పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. కాల్పుల్లో స్థానిక యువకుడి మృతితో హింసాత్మక ఘటనలు చెలరేగే ప్రమాదం ఉందన్న సమాచారంతో పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేశారు.

Exit mobile version