విధాత: అమెరికా (America) లో తుపాకీ కాల్పుల ఘటనలకు ఫుల్‌స్టాప్ పడేలా కనిపించడం లేదు. తాజాగా ఫిలడెల్ఫియాలో జరిగిన కాల్పుల ఘటనలో నలుగురు మరణించగా.. ఇద్దరు గాయపడ్డారు. సోమవారం సాయంత్రం జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఒక యువకుడిని అదుపులోకి తీసుకున్నారు.
ఈ ప్రమాదంలో 59, 22, 20, 16, 20 ఏళ్ల వ్యక్తులు మరణించారు. గాయపడిన వారిద్దరూ మైనర్లు కాగా వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. కాగా.. చనిపోయిన వారు, గాయపడిన వారూ అంతా మగవారేనని పోలీసు అధికారి ఒకరు తెలిపారు.
నిందితుడి దగ్గర ఒక రైఫిల్, బుల్లెట్‌ల మ్యాగజిన్‌లు, హ్యాండ్‌గన్, పోలీస్ స్కానర్ ఉన్నాయని వెల్లడించారు. అతడు ఇంటి నుంచి పారిపోయి తుపాకీతో కాల్పులు జరపాలని నిర్ణయించుకున్నట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది.
ఘటన జరుగుతున్న సమయంలో ఒక వ్యక్తి నిందితుడిపై కాల్పులు జరుపడంతో అతడినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా 2023లో ఇప్పటి వరకు ఫిలడెల్ఫియాలో 212 తుపాకీ కాల్పుల ఘటనలు చోటు చేసుకున్నాయి