విధాత: యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరి గుట్ట ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని 100 పడకల ఆసుపత్రిగా అప్ గ్రేడ్ చేస్తూ అందుకు అవసరమైన నిర్మాణాలకు రాష్ట్ర వైద్య విధాన పరిషత్ 45.79కోట్లు మంజూరు చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.
యాదాద్రి అభివృద్ధిలో భాగంగా సీఎం కేసీఆర్ నిర్మించతల పెట్టిన వంద పడకల ఆసుపత్రికి నిధులు మంజూరు కావడం స్థానికుల్లో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి.