Telangana | రేప‌ట్నుంచే ఒంటిపూట బ‌డులు.. ‘ప‌ది’కి ప్ర‌త్యేక త‌ర‌గ‌తులు య‌ధాత‌థం..

Telangana | వేస‌వి ఎండ‌ల( Summer ) తీవ్రత నేప‌థ్యంలో తెలంగాణ విద్యాశాఖ( Education Dept ) కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఈ నెల 15 నుంచి ఒంటి పూట బ‌డులు( Half Day Schools ) నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించింది. ఈ మేర‌కు రాష్ట్ర విద్యాశాఖ సోమ‌వారం ఉత్త‌ర్వులు జారీ చేసింది. ప్ర‌భుత్వ‌( Govt Schools ), ఎయిడెడ్‌, ప్ర‌యివేటు పాఠ‌శాల‌ల్లో ఉద‌యం 8 నుంచి మ‌ధ్యాహ్నం 12:30 గంట‌ల వ‌ర‌కు త‌ర‌గ‌తులు నిర్వ‌హించాల‌ని ఆదేశించింది. ఈ […]

  • Publish Date - March 14, 2023 / 03:01 AM IST

Telangana | వేస‌వి ఎండ‌ల( Summer ) తీవ్రత నేప‌థ్యంలో తెలంగాణ విద్యాశాఖ( Education Dept ) కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఈ నెల 15 నుంచి ఒంటి పూట బ‌డులు( Half Day Schools ) నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించింది. ఈ మేర‌కు రాష్ట్ర విద్యాశాఖ సోమ‌వారం ఉత్త‌ర్వులు జారీ చేసింది.

ప్ర‌భుత్వ‌( Govt Schools ), ఎయిడెడ్‌, ప్ర‌యివేటు పాఠ‌శాల‌ల్లో ఉద‌యం 8 నుంచి మ‌ధ్యాహ్నం 12:30 గంట‌ల వ‌ర‌కు త‌ర‌గ‌తులు నిర్వ‌హించాల‌ని ఆదేశించింది. ఈ నిబంధ‌న ఒక‌టో త‌ర‌గ‌తి నుంచి 9వ తర‌గ‌తి వ‌ర‌కు విద్యార్థుల‌కు వ‌ర్తిస్తుంద‌ని తెలిపింది. ఇక మ‌ధ్యాహ్నం 12:30 గంట‌ల‌కు త‌ప్ప‌నిస‌రిగా మ‌ధ్యాహ్నం భోజ‌నం అందించాల‌ని ఉత్త‌ర్వుల్లో పేర్కొంది.

ప‌దో త‌ర‌గ‌తి( Tenth Class ) విద్యార్థుల‌కు మాత్రం ప్ర‌త్యేక త‌ర‌గ‌తులు యథావిధిగా కొన‌సాగుతాయ‌ని విద్యాశాఖ స్ప‌ష్టం చేసింది. పదోతరగతి పరీక్ష కేంద్రాలకు కేటాయించిన స్కూల్స్‌లో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు తరగతులు నిర్వహించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నది.

Latest News