Little India | ఆస్ట్రేలియాలో లిటిల్ ఇండియా

విధాత‌: ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఉన్న హ్యారిస్ పార్క్ అనే ప్ర‌దేశానికి లిటిల్ ఇండియా (Little India) అని నామ‌క‌ర‌ణం చేస్తున్న‌ట్లు ఆ దేశ ప్ర‌ధాని ఆంథొనీ ఆల్బ‌నీస్‌, భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ సంయుక్తంగా ప్ర‌క‌టించారు. ప్ర‌స్తుతం ఆస్ట్రేలియా ప‌ర్య‌ట‌న‌లో ఉన్న ప్ర‌ధాని.. ఇక్క‌డ ఒక క‌మ్యూనిటీ స‌మావేశంలో పాల్గొన్న సంద‌ర్భంగా ఆల్బ‌నీస్ ఈ మేర‌కు వెల్ల‌డించారు. హ్య‌రిస్ పార్క్ అని పిలుస్తున్న ఈ ప్రాంతంలో భార‌తీయుల సంఖ్య ఎక్కువ‌. భార‌తీయ రెస్టారెంట్లు, వ్యాపారా స‌ముదాయాలు, దుకాణాలు ఇక్క‌డ […]

  • Publish Date - May 24, 2023 / 12:52 AM IST

విధాత‌: ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఉన్న హ్యారిస్ పార్క్ అనే ప్ర‌దేశానికి లిటిల్ ఇండియా (Little India) అని నామ‌క‌ర‌ణం చేస్తున్న‌ట్లు ఆ దేశ ప్ర‌ధాని ఆంథొనీ ఆల్బ‌నీస్‌, భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ సంయుక్తంగా ప్ర‌క‌టించారు.

ప్ర‌స్తుతం ఆస్ట్రేలియా ప‌ర్య‌ట‌న‌లో ఉన్న ప్ర‌ధాని.. ఇక్క‌డ ఒక క‌మ్యూనిటీ స‌మావేశంలో పాల్గొన్న సంద‌ర్భంగా ఆల్బ‌నీస్ ఈ మేర‌కు వెల్ల‌డించారు.

హ్య‌రిస్ పార్క్ అని పిలుస్తున్న ఈ ప్రాంతంలో భార‌తీయుల సంఖ్య ఎక్కువ‌. భార‌తీయ రెస్టారెంట్లు, వ్యాపారా స‌ముదాయాలు, దుకాణాలు ఇక్క‌డ విరివిగా ఉంటాయి.

ఇప్పుడు కూడా దీనిని అన‌ధికారికంగా లిటిల్ ఇండియా అనే పిలుస్తున్నారు. తాజా ప్ర‌క‌ట‌న‌తో అధికారికంగా ఆ పేరు స్థిర‌ప‌డ‌నుంది.

ఇదిలా ఉండ‌గా.. ఆస్ట్రేలియాలో ఉన్న హిందూ దేవాల‌యాల‌పై జ‌రుగుతున్న దాడుల గురించి మోదీ త‌న ప్ర‌సంగంలో ప్ర‌స్తావించారు. ఇలాంటి ఘ‌ట‌న‌లకు అడ్డుక‌ట్ట వేస్తామ‌ని ఆల్బ‌నీస్ హామీ ఇచ్చిన‌ట్లు తెలిపారు.

Latest News