Asia Cup 2023 | ఆసియా క‌ప్ ముందు క‌రోనా టెర్ర‌ర్.. ఇద్ద‌రు ఆట‌గాళ్లు ఔట్

Asia Cup 2023 | ఇటీవ‌ల ప్ర‌తిష్టాత్మ‌క టోర్నీల‌కి ముందు కరోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తున్న విష‌యం తెలిసిందే. ఇదే క్ర‌మంలో ఆగస్టు 30 నుంచి ప్రారంభం కానున్న ఆసియా కప్ టోర్నీకి ముందు శ్రీలంక క్రికెట్ జట్టుకు క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా వారిలో ఇద్ద‌రికి క‌రోనా పాజిటివ్‌గా తేలింది. అదే జ‌ట్టులోని మ‌రో ఇద్ద‌రు ఆటగాళ్లు టీమ్‌కి దూరం కాబోతున్న‌ట్టు తెలుస్తుంది. శ్రీలంక ఫాస్ట్ బౌలర్ దుస్మంత ఛమీరా.. లంక ప్రీమియర్ లీగ్‌లో అతని భుజానికి గాయం […]

  • Publish Date - August 26, 2023 / 02:50 PM IST

Asia Cup 2023 |

ఇటీవ‌ల ప్ర‌తిష్టాత్మ‌క టోర్నీల‌కి ముందు కరోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తున్న విష‌యం తెలిసిందే. ఇదే క్ర‌మంలో ఆగస్టు 30 నుంచి ప్రారంభం కానున్న ఆసియా కప్ టోర్నీకి ముందు శ్రీలంక క్రికెట్ జట్టుకు క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా వారిలో ఇద్ద‌రికి క‌రోనా పాజిటివ్‌గా తేలింది. అదే జ‌ట్టులోని మ‌రో ఇద్ద‌రు ఆటగాళ్లు టీమ్‌కి దూరం కాబోతున్న‌ట్టు తెలుస్తుంది.

శ్రీలంక ఫాస్ట్ బౌలర్ దుస్మంత ఛమీరా.. లంక ప్రీమియర్ లీగ్‌లో అతని భుజానికి గాయం కావడంతో ఆసియా కప్ 2023 టోర్నీ మొత్తానికి దూరం కాబోతున్నాడ‌ని అంటున్నారు. ఇక‌ లంక ప్రీమియర్ లీగ్‌లో ఆల్‌రౌండ్ పర్ఫామెన్స్‌తో అదరగొట్టిన వానిందు హసరంగ గాయంతో బాధ‌ ప‌డుతున్న‌ట్టు శ్రీలంక మీడియా చెబుతుంది. హ‌స‌రంగ తొడ‌కు బ‌ల‌మైన గాయం కావ‌డంతో దాని నుండి కోలుకోవ‌డానికి రెండు వారాల స‌మ‌యం ప‌డుతుంద‌ని అంటున్నారు.

గ్రూప్ స్టేజీలో శ్రీలంక ఆడే రెండు మ్యాచుల్లోనూ వానిందు హసరంగ ఆడే అవ‌కాశం లేన‌ట్టుగా క‌నిపిస్తుంది. అత‌ను శ్రీలంక కీ ప్లేయ‌ర్ కాగా, అత‌ను బ్యాటింగ్,బౌలింగ్‌లో మెరుగ్గా రాణిస్తుంటాడు. ఆయ‌న జట్టుకి దూరం కావ‌డం పెద్ద దెబ్బే అని చెప్పాలి.

ఇక శ్రీలంక సీనియర్ బ్యాటర్లు కుశాల్ పెరేరా, ఆవిష్క ఫెర్నాండోకి క‌రోనా పాజిటివ్‌గా తేల‌డంతో వారిద్ద‌రు ఐసోలేష‌న్‌లో ఉన్న‌ట్టు తెలుస్తుంది. అయితే కరోనా సోకిన ప్లేయర్లను జ‌ట్టుకి దూరంగా పెట్టాలనే నిబంధనను ఏడాది కిందటే తొలగించింది. దీంతో వారిద్ద‌రిని ఆసియా కప్ 2023 ఆడించాలా? లేదా? అనేది లంక క్రికెట్ బోర్డ్ నిర్ణ‌యంపై ఆధార‌ప‌డి ఉంటుంది.

మిగిలిన ప్లేయర్ల క్షేమాన్ని దృష్టిలో పెట్టుకుంటే మాత్రం, ఈ ఇద్దరికీ నెగిటివ్ రిజల్ట్ వచ్చిన తర్వాత మాత్ర‌మే లంక ఆడించే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే ఆసియా కప్ 2022 టోర్నీ ఫైనల్ మ్యాచ్‌లో అంతా పాకిస్తాన్‌ని ఫెవరెట్‌గా భావించారు. కానీ అంచనాలకు మించి రాణించిన శ్రీలంక.. ఆసియా కప్ 2022 టోర్నీ టైటిల్ గెలుచుకుంది.

ఇప్పటికే 6 సార్లు ఆసియా కప్ టైటిల్ గెలిచిన శ్రీలంక, టీమిండియా (ఏడు సార్లు) తర్వాతి స్థానంలో ద‌క్కించుకుంది. పాకిస్తాన్ జ‌ట్టు మాత్రం కేవ‌లం రెండు సార్లు మాత్రమే ఆసియా కప్ గెలుచుకుంది. ఆసియా కప్ 2023 టోర్నీలో శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ గ్రూప్ బీలో త‌ల‌ప‌డ‌నుండ‌గా, వీటి మ‌ధ్య కూడా మంచి ఉంటుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు.

Latest News