Site icon vidhaatha

King Cobra: ప్రపంచంలోనే అతిపెద్ద కింగ్ కోబ్రా చూశారా.. !

King Cobra: ప్రపంచంలో అత్యంత విషపూరితమైన పాములలో కింగ్ కోబ్రా ప్రముఖమైనది. కోబ్రా కాటుకు గురైతే విషానికంటే ముందు భయానికే చనిపోయే పరిస్థితి. అలాంటిది ఓ యువకుడు భారీ కింగ్ కోబ్రాతో సహవాసం చేస్తుండటమే కాదు..నిత్యం దాని ఆలన పాలన చూస్తున్నాడు. అతను తన కింగ్ కోబ్రాతో చేసిన రీల్స్ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. నీ వద్ధ ఉన్న కింగ్ కోబ్రా ప్రపంచంలోనే అతిపెద్దదైన..విషపూరితమైన కింగ్ కోబ్రాలలో ఒక్కటని ఆ యువకుడికి గుర్తు చేశారు.

దీంతో తన వద్ధ ఉన్న కింగ్ కోబ్రా ప్రపంచంలోనే అతిపెద్ద కింగ్ కోబ్రాల్లో ఒకటని తెలుసుకున్న ఆ యువకుడు కించిత్ భయపడినా..నిత్యం దానితోనే ఉంటున్నానన్న ధీమాతో..దానిని చేతిలోకి తీసుకుని వీడియోకు ఫోజులిస్తూ మురిసిపోయాడు. అంతపెద్ద కింగ్ కోబ్రాను అతను చేతులతో ప్రదర్శించిన వీడియో చూసిన నెటిజన్లు వామ్మో వీడు సామాన్యుడు కాడు అంటూ అభినందిస్తునే..ఎందుకైనా మంచిది జర పైలం అంటూ జాగ్రత్తలు చెబుతున్నారు.

 

Exit mobile version