Heart Stroke | 16 వేల మందికి గుండె ఆప‌రేష‌న్లు చేసిన డాక్ట‌ర్.. గుండెపోటుతో మృతి

Heart Stroke | ఆయ‌నో ప్ర‌ముఖ కార్డియాల‌జిస్ట్.. అస‌లు ఆయ‌న పేరు తెలియ‌ని వారే ఉండ‌రు. ఎందుకంటే.. ఏకంగా 16 వేల మందికి గుండె ఆప‌రేష‌న్లు చేసి.. పున‌ర్జ‌న్మ ఇచ్చారు. అంతే కాదు.. గుండె జ‌బ్బుల‌ను ఆదిలోనే అరిక‌ట్టేందుకు తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌పై ల‌క్ష‌లాది కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించి, ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న క‌ల్పించారు. అటు గుండె ఆప‌రేష‌న్లు చేయ‌డం, ఇటు అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాలు క‌ల్పిస్తూ.. ల‌క్షల మంది హృద‌యాల్లో స్థానం సంపాదించుకున్న ఆ కార్డియాల‌జిస్ట్ అనుహ్యంగా గుండెపోటుకు గురై ప్రాణాలు […]

  • Publish Date - June 7, 2023 / 06:09 PM IST

Heart Stroke | ఆయ‌నో ప్ర‌ముఖ కార్డియాల‌జిస్ట్.. అస‌లు ఆయ‌న పేరు తెలియ‌ని వారే ఉండ‌రు. ఎందుకంటే.. ఏకంగా 16 వేల మందికి గుండె ఆప‌రేష‌న్లు చేసి.. పున‌ర్జ‌న్మ ఇచ్చారు. అంతే కాదు.. గుండె జ‌బ్బుల‌ను ఆదిలోనే అరిక‌ట్టేందుకు తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌పై ల‌క్ష‌లాది కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించి, ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న క‌ల్పించారు.

అటు గుండె ఆప‌రేష‌న్లు చేయ‌డం, ఇటు అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాలు క‌ల్పిస్తూ.. ల‌క్షల మంది హృద‌యాల్లో స్థానం సంపాదించుకున్న ఆ కార్డియాల‌జిస్ట్ అనుహ్యంగా గుండెపోటుకు గురై ప్రాణాలు విడిచారు.

వివ‌రాల్లోకి వెళ్తే.. గుజ‌రాత్‌లోని జామ్‌న‌గ‌ర్‌లో డాక్ట‌ర్ గౌర‌వ్ గాంధీ(41) గ‌త కొన్నేండ్ల నుంచి కార్డియాల‌జిస్ట్‌గా సేవ‌లందిస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు సుమారు 16 వేల మందికి పైగా గుండె ఆప‌రేష‌న్లు చేసి వారి ప్రాణాల‌ను నిల‌బెట్టారు.

అయితే గాంధీ.. మంగ‌ళ‌వారం ఉద‌యం గుండెపోటుకు గురై చ‌నిపోయిన‌ట్లు కుటుంబ స‌భ్యులు తెలిపారు. దీంతో రోగులు, ఆస్ప‌త్రి వ‌ర్గాలు ఆశ్చ‌ర్యానికి గుర‌య్యారు. అస‌లు గాంధీ గుండెపోటుకు గురికావ‌డం ఏంట‌ని ప్ర‌శ్నించుకుంటున్నారు.

రోజు మాదిరిగానే సోమ‌వారం రాత్రి విధులు ముగించుకున్న డాక్ట‌ర్ గాంధీ.. ఇంటికి చేరుకున్నారు. కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి భోజ‌నం చేసిన గాంధీ.. అనంత‌రం త‌న గ‌దిలోకి వెళ్లి నిద్రించారు. ప్ర‌తి రోజు ఉద‌యం 6 గంట‌ల‌కే లేచే గాంధీ.. మంగ‌ళ‌వారం ఆరు దాటినా కూడా నిద్ర లేవ‌లేదు.

దీంతో కుటుంబ స‌భ్యుల‌కు అనుమానం వ‌చ్చి గాంధీ గ‌ది వ‌ద్ద‌కు వెళ్లి పిలిచారు. అత‌నిలో స్పంద‌న లేక‌పోవ‌డంతో.. ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. గాంధీ గుండెపోటుతో మృతి చెందార‌ని వైద్యులు నిర్ధారించారు. దీంతో గాంధీ మృతి ప‌ట్ల రోగులు, వైద్యులు తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు.

Latest News