గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ మంత్రివర్గాన్ని పునర్వవ్యవస్థీకరించనున్నారు. దీంతో ఆయన మినహా ఆయన కేబినెట్‌లోని 16 మంది మంత్రులు రాజీనామా చేశారు. ఈ నెల 17న కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మంత్రివర్గ పునర్వవ్యవస్థీకరణకు వీలుగా మంత్రులు రాజీనామా చేశారు.
గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, బీజేపీ గుజరాత్ రాష్ట్ర అధ్యక్షుడు జగదీశ్ విశ్వకర్మ ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో న్యూఢిల్లీలో ఇటీవల భేటీ అయ్యారు. ఈ భేటీ తర్వాత గుజరాత్ కేబినెట్ పునర్వవ్యవస్థీకరణపై సీఎం భూపేంద్ర పటేల్ నిర్ణయం తీసుకున్నారు.
Gujarat Cabinet Expansion On Oct 17 | గుజరాత్‌లో సీఎం మినహా మంత్రుల రాజీనామా: అక్టోబర్ 17న కొత్త మంత్రుల ప్రమాణం
గుజరాత్‌లో సీఎం భూపేంద్ర పటేల్ మినహా కేబినెట్‌లోని 16 మంది మంత్రులు రాజీనామా చేశారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. అక్టోబర్ 17న కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
