Heavy rains
విధాత: తెలంగాణ వ్యాప్తంగా అన్ని విద్యాసంస్థలకు ఈ నెల 22 (శనివారం)న సెలవు ప్రకటిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. భారీ వర్షాలు, వరదల కారణంగా సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు శనివారం కూడా అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటిస్తున్నట్టు విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అన్ని జిల్లాల విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
మరో 24 గంటల పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన సంగతి తెలిసిందే.
తెలంగాణ వ్యాప్తంగా గత మూడు రోజుల నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తోన్న సంగతి తెలిసిందే. భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో గురు, శుక్రవారాల్లో రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలకు విద్యాశాఖ సెలవులు ప్రకటించిన సంగతి తెలిసిందే.