జనవరిలో హీరో 440 సీసీ బైక్‌ లాంచ్‌.. ఫీచర్స్‌, లాంచ్‌ డేట్‌ వివరాలు ఇవే..!

కొత్త సంవత్సరం వచ్చేసింది. ఈ క్రమంలో పలు ఆటోమొబైల్‌ కంపెనీలు 2024లో కొత్త ఉత్పత్తులు మార్కెట్‌లోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి.

  • Publish Date - January 2, 2024 / 07:08 AM IST

Hero New Bike | కొత్త సంవత్సరం వచ్చేసింది. ఈ క్రమంలో పలు ఆటోమొబైల్‌ కంపెనీలు 2024లో కొత్త ఉత్పత్తులు మార్కెట్‌లోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. ప్రముఖ ఆటోమొబైల్‌ కంపెనీ హీరో మోటోకార్ప్‌ సైతం జనవరిలోనే కొత్త బైక్‌ను లాంచ్‌ చేసేందుకు సిద్ధమైంది. హీరో 440 సీసీ బైక్‌ను ఈ నెల 22న లాంచ్‌ చేయనున్నట్లు సమాచారం.


అయితే, కంపెనీ ఇప్పటి వరకు బైక్‌ పేరును ఇంకా ప్రకటించలేదు. కంఫర్ట్‌, బోల్డ్‌ అప్పియరెన్స్‌, కమాండింగ్‌ పొజిషన్‌ను దృష్టిలో పెట్టుకొని కంపెనీ బైక్‌ను రూపొందించినట్లు సమాచారం. హీరో కొత్త బైక్‌ డిజైన్‌ యమహా ఎంటీ-01, హార్లీ డేవిడ్​సన్​ ఎక్స్​440 బైక్‌ను పోలి ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. ఈ బైక్‌ని హార్లీ డేవిడ్​సన్​ ఎక్స్​ 440ని రూపొందించిన ప్లాట్​ఫామ్​పైనే హీరో మోటోకార్ప్‌ సైతం తయారు చేస్తున్నది.


ఇందులో 440 సీసీ, సింగిల్​ సిలిండర్​, ఎయిర్​ కూల్డ్​ ఇంజిన్​ ఉండనున్నట్లు టాక్‌. 27 హెచ్​పీ పవర్​ని, 38 ఎన్​ఎం టార్క్​ని జనరేట్​ చేయనుండగా.. ఇందులో సిక్స్‌ స్పీడ్​ గేర్​బాక్స్​తో రానున్నది. అయితే, హీరో కొత్తగా లాంచ్‌ చేయనున్న బైక్‌ పేరు, ధర, ఫీచర్స్‌ గురించి వివరాలు తెలియరాలేదు. ప్రస్తుతం కంపెనీ సమాచారాన్ని రహస్యంగా ఉంచుతున్నది.


దీంతో బైక్‌పై అంచనాలు భారీగా పెరిగాయి. 440సీసీ కొత్త బైక్‌ ఎక్స్‌ షోరూం ధర రూ.2లక్షల వరకు ఉండే అవకాశం ఉందని అంచనాలున్నాయి. ఇక ధర పూర్తి వివరాలు అందుబాటులోకి రావాలంటే ఈ నెల 22 వరకు వేచిచూడాల్సిందే.