Site icon vidhaatha

High Court | ఎన్ని కుంట‌లు, చెరువుల‌కు.. బ‌ఫ‌ర్ జోన్ ఫిక్స్ చేశారు?: హైకోర్టు

High Court

హైద‌రాబాద్‌, విధాత: హెచ్‌ఎండీఏ పరిధిలో ఎన్ని కుంటలు, చెరువులకు ఎఫ్‌టీఎల్‌ బఫర్‌ జోన్‌ ఫిక్స్‌ చేశారు.. ఇంకా ఎన్ని చేయాలి అనే పూర్తి వివరాలతో నివేదిక అందజేయాలని టూరిజం విభాగాన్ని రాష్ట్ర హైకోర్టు గురువారం ఆదేశించింది.

రామ్మమ్మ కుంట బఫర్‌ జోన్‌లో టూరిజం విభాగం భవనం నిర్మిస్తోందని, అందుకు అధికారులు అనుమతి ఇవ్వడం చట్టవిరుద్ధమని పేర్కొంటూ మానవ హక్కులు, వినియోగదారుల రక్షణ సెల్‌ ట్రస్ట్‌ హైకోర్టులో పిల్ దాఖలు చేసింది.

దీనిపై చీఫ్ జ‌స్టిస్ అలోక్ అరాధే, జ‌స్టిస్ వినోద్‌కుమార్ ధ‌ర్మాస‌నం విచార‌ణ చేప‌ట్టింది. రామ్మమ్మ కుంట బఫర్‌ జోన్‌ పరిధిలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టడం లేదంటూ ఓ అఫిడవిట్‌ కూడా దాఖలు చేయాలని ఆదేశిస్తూ, త‌దుప‌రి విచారణను వాయిదా వేసింది.

Exit mobile version